- ప్రజా పాలనలో నిరుపేదలకు అండగా ప్రభుత్వం
- 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్
Indiramma Houses makes the dream of owning a home for the poor a reality తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజా పాలన’లో భాగంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ అన్నారు. ఆదివారం తూర్పు కోట పరిధిలోని కొత్తగడ్డ ప్రాంతంలో లబ్ధిదారుల గృహప్రవేశం మరియు నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
కొత్తగడ్డకు చెందిన అచ్చ శశికళ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇంటి పథకాన్ని వినియోగించుకుని, గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం వైభవంగా గృహప్రవేశం నిర్వహించగా, కార్పొరేటర్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు. అలాగే, గడ్డం మమత అనే మరో లబ్ధిదారురాలు తన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గాను భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కృషితో డివిజన్లోని నిరుపేదలకు న్యాయం జరుగుతోందన్నారు. పేదల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ అందించి ఆశీర్వదించాలని కోరారు.
Indiramma Houses makes the dream of owning a home for the poor a reality
“ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడ్డామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో మా కల నెరవేరిందని” లబ్ధిదారు శశికళ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంగరబోయిన చందర్, మీడిదుల రాణి, బేడిద వీరన్న, నలివెల శివన్న, రాజబోయిన రాజమల్లు, అభిషేక్, వార్డు ఆఫీసర్ రవి, బిల్ కలెక్టర్ పూర్ణ చందర్ మరియు స్థానిక నాయకులు, లబ్ధిదారుల బంధువులు పాల్గొన్నారు.
