
“Indiramma” bills should be released హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని అన్ని గ్రామాలలో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు ఇందిరమ్మ ఇంటి బిల్లులను ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు తక్షణమే బిల్లులు విడుదల చేయాలని బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో ఫణి చంద్రకు వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మొగ్గం. సుమన్ బహుజన సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు మారేపల్లి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.