
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ రత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకోర్చి రచించిన భారత రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని మాజీ మంత్రి దయాకర్ రావు కు బహుకరించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందీప్, సభ్యులు జట్టి విక్రమ్, సందీప్, రాజేందర్, వెంకటేష్ సుంకరి కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సమాంతర బుక్ హౌస్ ఎడిటర్ వరుణ్ కుమార్ సభ్యులను అభినందిస్తూ భారతదేశ ప్రజలకు ఎన్నో ఒడిదోడుకులు ఎన్నో కష్టాలను ఓర్చి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి భారతీయ పౌరుడికి అంకితం చేసిన రోజు కావున భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగం గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా వాడవాడల రాజ్యాంగం పుస్తకాన్ని పంపిణీ చేసి ప్రజలను చైతన్యవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా విస్తరించి ఉన్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ముందుండి ఇలాంటి పనులకు చొరవ చూపాలని పిలుపునిచ్చి ఎలాంటి సహాయానికైనా తానున్నానని హామీ ఇచ్చారు.