
Achampeta mandal రాజ్యాంగం పై ఉపాధ్యాయుడు ఏముల నరసింహులు రాసిన పాటను అచ్చంపేట మండలం ఐనోలు గిరిజన బాలికల గురుకుల (పీవీటీజీ) పాఠశాల ప్రిన్సిపాల్ కె. పుష్పలత ఆదివారం గణంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. అలాగే ఆడియోను రిలీజ్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాట ను రిలీజ్ చేసినట్లు రచయిత తెలిపారు. తన మిత్రుడు వెన్నెల సత్యం ప్రోత్సాహంతో పాటను ముందుకు తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సువర్ణ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వినయశీల, డిప్యూటీ వార్డెన్ ఉమాదేవి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.