
జయహో జయహో భారత రాజ్యాంగమా
జయహో జననీ భారతి మా ప్రాణమా
శాంతి సత్యం త్యాగం తథాగత తత్వమా
సమత మమత జనతా నీ చిరునామా..
అంబేద్కర్ సృష్టించిన హక్కుల అమృత భాండమా
సంబరమే కొని తెచ్చిన సర్వజన నేస్తమా
మనువాదం గుండెలపై పేలిన రణ నినాదమా
జనవాదం విన్పించగ జయ భేరి నాదమా
‘రాజు’ను ఓడించిన ఓ యుద్ధ తంత్రమా
‘ప్రజ’నే రాజును చేసిన అక్షర శాసనమా
ప్రజాస్వామ్య పరిరక్షణ అర్జున గాండీవమా
ప్రజ స్వేచ్చా స్వాతంత్రముల అంబరమా
డెబ్బై ఐదేళ్ల ఘన చరిత నీదేనమ్మా
శత కోటి జన భారతి జేజేలమ్మా
మా హక్కుల కనుపాపల కాపాడగ నీవమ్మా
ఈ పాలకుల పాపాలు కడుగగ రావమ్మా
జయహో జయహో భారత రాజ్యాంగమా
జయహో జననీ భారతి మా ప్రాణమా
———————————————
వై. నరసింహులు
మహబూబ్నగర్ జిల్లా
సెల్: 9398212217
(భారత 76వ గణంత్ర దినోత్సవం నేపథ్యంలో…
26.01.1950 – 26.01.2025)