- స్వతంత్ర అభ్యర్థిగా “బందు సుజాత – క్రాంతి” నామినేషన్ ధాకలు..!
- సీపీఎం శూన్యతను భర్తీ చేసేందుకు .. ప్రజల సానుభూతితో ముందుకు..!
Independent voice in Bhupalapally 8th ward : జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ 8వ వార్డులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీలో కీలక కార్యకర్తగా ఉన్న బందు సుజాత – క్రాంతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇన్నాళ్లూ కేడర్ బలంపై ధీమాగా ఉన్న ప్రధాన పార్టీలకు, ముఖ్యంగా సీపీఎంకు ఊహించని షాక్ తగిలింది. సీపీఎం పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ వస్తున్న బందు సుజాత – క్రాంతి ప్రజాభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా (సీపీఎం రెబల్) బరిలోకి దిగారు. శుక్రవారం ఆమె తన కుటుంబ సభ్యులు, సఫోర్ట్ దారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ 8వ వార్డులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయ సమీకరణలు కూడా మారే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్డులో అభ్యర్థిని ఖరారు చేయడంలో సిపిఎం నాయకత్వం సరైన విధంగా స్పందించకపోవడం,, సిపిఎం పార్టీకి ఎంతోకొంత మెరుగైన సానుభూతి ఎక్కువగా ఉందని భావించే ఈ 8వ వార్డులో అధికారిక అభ్యర్థిని ప్రకటించకపోవడం, అదే సమయంలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన అంకితభావంతో ఉంటు ముందుకు సాగుతున్న బందు సుజాత – క్రాంతి పార్టీ ఉనికిని కాపాడేందుకు, ప్రజా సమస్యలే అజెండాగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సీపీఎం పార్టీ టికెట్ కేటాయించకపోయినప్పటికీ, ప్రజల ఆకాంక్షల మేరకు బందు సుజాత – క్రాంతి స్వంతంత్ర (సిపిఎం రెబల్ ) అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉండటం అనివార్యం అయినట్లు తెలుస్తోంది.
Independent voice in Bhupalapally 8th ward
- సీపీఎం శూన్యతను భర్తీ చేసేందుకు .. ప్రజల సానుభూతితో ముందుకు..!
8వ వార్డులో సిపిఎం పార్టీకి బలమైన సానుభూతి, ఆదరణ ఉన్నప్పటికీ, పార్టీ తరపున అధికారిక అభ్యర్థి లేకపోవడం కార్యకర్తలను అయోమయానికి గురిచేసింది. ఈ తరుణంలో సుజాత ముందుకు రావడం స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పలువురు భావిస్తున్నారు. సిపిఎం జెండాను ఈ వార్డులో గెలవనివ్వకూడదనే కుట్రలను తిప్పికొట్టడమే తమ లక్ష్యం అని సుజాత – క్రాంతి ప్రకటించడం తమలోని దృఢ సంకల్పాన్ని రుజువు చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నామినేషన్ అనంతరం బందు సుజాత – క్రాంతి మాట్లాడుతూ, వార్డులో సమస్యలు పరిష్కారం కాకపోవడం, పార్టీలు కేవలం ఓట్ల కోసమే ప్రజల వద్దకు రావడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రజల ఎజెండానే ముఖ్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజలు, సానుభూతిపరులు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు తమ పోటీని సానుకూలంగా పరిశీలించి మద్దతుగా నిలువాలని కోరారు.
