
- పత్తిపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనందించిన కుటుంబసభ్యులు
- టీ షర్ట్స్, షర్ట్స్ తో పాటు నగదు బహుకరణ
- శాంసుందర్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా విద్యాభివృద్ధికి తోడ్పాటు
- కొనియాడిన విద్యార్థులు, ఉపాద్యాయులు, గ్రామస్తులు
In memory of Chitti Reddy shyamsundar Reddy : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. విద్యావంతులైన ఆయన నిత్యం విద్యాభివృద్ధికి తపించారని పలువురు గ్రామస్తులు గుర్తు చేసుకుంటారు. ఆయన మృతి చెందినప్పటికీ కుటుంబ సభ్యులు ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు. దివంగత చిట్టి రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి సతీమణి భాగ్యలక్ష్మి, కుమారులు చరిత్ర రెడ్డి, కుమార్తె సీమా రెడ్డి ప్రతిఏటా తన స్వగ్రామమైన పత్తిపాకలో విద్యార్దులకు విద్యాభివృద్ధి కోసం సహాయం అందిస్తూవస్తున్నారు. ఈఏడాది కూడా పత్తిపాక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
In memory of Chitti Reddy shyamsundar Reddy :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహించిన చిట్టిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి జ్ఞాపకార్థం పత్తిపాక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ వివిధ రకాల టీ షర్ట్స్ , షార్ట్స్ , పదో తరగతి పూర్వ విద్యార్థులకు రూ. 8వేల నగదు బహుమతిని ప్రధానం చేశారు. విద్యాశాఖలో చాలా కాలం పని చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్థితిగతులను స్వయంగా అధ్యయనం చేసిన స్వర్గీయ శ్యాంసుందర్ రెడ్డి ఆశయాలకు కొనసాగింపుగా వారి సతీమణి భాగ్యలక్ష్మి, కుమారులు చరిత్ర రెడ్డి, కుమార్తె సీమా రెడ్డి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు. సుమారుగా రూ. 30 వేల రూపాయలు వారి స్వగ్రామమైన పత్తిపాక పాఠశాల పిల్లలకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు దివంగత శ్యాంసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులు డాక్టర్ చిట్టి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ రాజి రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొని తెలిపారు. విద్యాశాఖలో ఉన్నత స్థాయిలో నిలిచిన శ్యామసుందర్ రెడ్డి సేవలను కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి కుటుంబ సభ్యుల ఔన్నత్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రగతికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్యాంసుందర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయులు అనిత, విజయ, సోంబాబు, బొలిశెట్టి కమలాకర్, విజయ్, రఘు, కిరణ్మయి పాల్గొని గ్రామ ప్రజల ఉదాహరత్వాన్ని అభినందించారు.