
- “డాంబర్ ప్లాంట్” ఏర్పాటుపై అనుమానాలెన్నో…!
- “ప్రగతి”లో దర్జాగా “డాంబర్ ప్లాంట్” ఏర్పాటు…!
- అనుమతులు లేకుండానే ఏర్పాటు చేశారనే ఆరోపణలు…
- జీపీ, రెవెన్యూ, పొల్యూషన్ సంబంధిత అధికారుల పర్మిషన్ల పై గందరగోళం…
- సమగ్రమైన విచారణ చేపడితే ఆ “డాంబర్ ప్లాంట్” బండారం బయటపడే అవకాశం….
- ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న పలువురు…
Illegal asphalt plant : “ప్రగతి”పై కాలుష్యం వెదజల్లడానికి యధేచ్ఛగా డాంబర్ ప్లాంట్ నిర్వహణ జరుగుతోంది. అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనే క్లారిటీ లేకుండా పోయింది. కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, జీపీ, తదితరశాఖల అనుమతులు లేకుండానే దర్జాగా డాంబర్ ప్లాంట్ ఏర్పాటు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఆ డాంబర్ ప్లాంట్ కథ చర్చానీయాంశంగా మారుతోంది. నిబంధనలకు ఏర్పాటైన డాంబర్ ప్లాంట్ పై పలువురు గ్రామస్తులు, రైతులు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా పొలిటికల్ సపోర్ట్ తో నిర్వాహకులు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Illegal asphalt plant :
డాంబర్ ప్లాంట్ల వ్యవహారం మండల ప్రజలకు కొత్తేమీ కాదు. క్రషర్లు శబ్దాలు, డాంబర్ ప్లాంట్లతో కాలుష్యంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న మండలంలోని పలు గ్రామాల ప్రజలు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో “ప్రగతి”కి కూడా డాంబర్ ప్లాంట్లతో కాలుష్య ముప్పు తప్పదని భావిస్తున్నారు. అయితే అనుమతుల పరిస్థితి ఏంటి…? ఏ స్వభావం కలిగిన భూమిలో డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు..? జీపీ, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు ఉన్నాయా..? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది..? ప్రజలు, రైతుల అభిప్రాయాలు ఏంటి..? అనే కోణంలో ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.