
- వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో అదనంగా వసూళ్లు చేపిస్తున్న ఇంచార్జి డిటివో..
- వసూళ్లకు ప్రత్యేకంగా ప్రైవేట్ అసిస్టెంట్…
- ప్రైవేట్ అసిస్టెంట్ ను పట్టుకుంటే ఎంవీఐ ల గుట్టురట్టయ్యే అవకాశం..
- ఇద్దరముంటే నా ఒక్కడి స్టోరీనే ఎలా రాస్తారని ఇంచార్జి డిటివో తన సన్నిహితులతో గోడు వెల్లబోసుకుంటున్నట్లు ప్రచారం..
- ఇప్పటికే అవినీతి ఆరోపణలు… విధుల్లో నిర్లక్ష్యం కారణంగా కలెక్టర్ ఆగ్రహానికి గురైన ఆర్టీవో…
If the collector finds out, strict action will be taken : వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారుల నుండి లంచాల రూపంలో అదనంగా వసూళ్లు చేసేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ అసిస్టెంట్లను నియమించుకున్నారట ఆ కార్యాలయంలో విధులు నిర్వహించే ఎంవీఐ లు. కార్యాలయానికి వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చే వాహనదారుల్లో పది శాతం మాత్రమే నేరుగా పనులు చేపించుకుంటుండగా మిగిలిన తొంబై శాతం వాహనదారులు ఏజెంట్ ల ద్వారా ఆర్టీఏ కార్యాలయంలో తమ పనులను చక్కబెట్టుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
If the collector finds out, strict action will be taken
ఏజెంట్ ల వద్దకు వచ్చే వాహనదారుల నుండి ప్రతీ సేవకు అదనంగా వసూళ్లు చేసే ఏజెంట్ లు ఎంవీఐ లు నియమించుకున్న” ప్రైవేట్ అసిస్టెంట్” కు లంచాలు ఇచ్చి వాహనదారులు తీసుకువచ్చే పత్రాలపై ఓ కోడ్ వేపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పత్రాలపై వారి అసిస్టెంట్ ల కోడ్ చూసిన వెంటనే సదరు ఎంవీఐ లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఓకే చేస్తున్నట్లు సమాచారం.ఒకవేళ పత్రాలపై ప్రైవేట్ అసిస్టెంట్ కోడ్ కనుక లేకపోతే రకరకాల కొర్రీలు పెట్టి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు.
If the collector finds out, strict action will be taken
- కలెక్టర్ కు తెలిస్తే కఠిన చర్యలే…?
వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఎంవీఐ లు ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా వాహనదారుల నుండి అదనంగా వసూళ్లు చేస్తున్న వ్యవహారం జిల్లా కలెక్టర్ కు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని పలువురు వాహనదారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అదనపు వసూళ్లు ,వసూళ్లను ప్రోత్సహిస్తున్న ఇంచార్జి డిటివో శోభన్ పై జననిర్ణయం ప్రచురిస్తున్న వరుస కథనాలపై సదరు అధికారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరం ఎంవీఐ లు ఉంటే నా ఒక్కడి పేరునే రాయడం ఎంతవరకు సమంజసం అని రాస్తే ఇద్దరు అధికారుల పేర్లు రాయాలని పలువురితో తన భాధను పంచుకోవడం గమనార్హం.అసలు విషయం ఏమిటంటే అక్రమంగా వాహనదారుల నుండి ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా లంచాల రూపంలో వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐ ల స్టోరీ కనుక జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని పలువురు వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.
If the collector finds out, strict action will be taken
- అధికారుల చేతికి మట్టి అంటకుండా ప్రైవేట్ అసిస్టెంట్ తో వసూళ్లు…
- కలెక్టర్ మేడం వసూళ్ల వ్యవహారం పై దృష్టి సారిస్తారా..?
సమగ్ర కథనం.. మరో సంచికలో…