
Hyena attacks హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో హైనా (Hyena attacks) మరోసారి హల్ చల్ చేశాయి. గత వారంలో లేగదుడలను చంపితిన్న ఘటన మరువక ముందే మరోసారి మేకపిల్లలపై హైనాలు దాడి చేశాయి. వరుస ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనుషులపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. హైనా సంచారంతో స్థానిక రైతులు, ప్రజలు నిత్యం భయాందోలనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలాగైనా హైనాను బంధించి పశువులకు రక్షణ కల్పించాలని రైతులు, గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.