
జన నిర్ణయం /శాయంపేట శాయంపేట మండల కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం లో కార్మికులు రెండు నెలల 17 రోజుల నుండి చేసిన పనికి వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని ఎన్నిసార్లు కార్మికులు మొరపెట్టుకున్నా ప్రస్తుత చైర్మన్ మామిడి శంకర్ లింగం సంఘంలో డబ్బులు లేవు వచ్చిన తర్వాత చూస్తాము అని అనడం అనడం ఎంతవరకు సమంజసం అని కార్మికులు అన్నారు. చేనేత సహకార సంఘం చైర్మన్ అయి ఉండి కార్మికుల సమస్యల గురించి ఎప్పుడు అడిగినా కానీ మేనేజర్ చూసుకుంటాడు. నాకేం తెలవదని అనడం ఎంతవరకు కరెక్ట్ అని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పాలకవర్గం గత 12 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి కార్మికులకు సరైన న్యాయం చేయకుండా దాటవేసే ధోరణిలో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని తక్షణమే పాలకవర్గాన్ని డిస్మిస్ చేసి కార్మికులకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల సంఘంలో ఎటువంటి పనికి ముందుకు రామని నిరాహార దీక్షలో మా బాధలు పై అధికారుల దృష్టికి వెళ్లే వరకు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడున్న పాలకవర్గం అధికారంలోకి వచ్చిన నుండి జరుగుతున్న అవకతవకలపై జిల్లా అధికారులతో ఎంక్వయిరీ వేసి తక్షణమే చర్య తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేనియెడల చేనేత పరిశ్రమక సహకార సంఘాన్ని స్తంభింప చేస్తామని జిల్లా స్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.