
Humanity is revealed madikonda ci pulyala kishan : అస్వస్థతతో మడికొండ బురుజు వద్ద పడిపోయి ఉన్న తమిళనాడుకు చెందిన షర్మిల దేవి అనే వృద్ధురాలిని మానవతా హృదయంతో మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ అనాధాశ్రమంలో చేర్పించి వైద్యం చేయించారు.
Humanity is revealed madikonda ci pulyala kishan :
ఓ వైపు విధులు.. మరోవైపు సేవలు ఇది నేటితరం పోలీసుల తీరు అనేలా సీఐ పుల్యాల కిషన్ ను తన సేవా భావాన్ని పలు సందర్భాల్లో ఆచరణలో పెట్టడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఒకప్పుడు పోలీసులంటే అతిభయంకరమైన వ్యక్తులుగా ముద్ర పడింది. కానీ, కాల క్రమేణా చట్టాలు మారడం, వ్యక్తిగతంగా వారు కూడా విధులతో పాటు నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడం చూస్తున్నామని పోలీసుల్లో ఇలాంటి సేవా దృక్పథం మరింత పెరిగితే అనాధలకు అవకాశం వచ్చినప్పుడు ఆసరా దొరుకుతుందని, పుల్యాల కిషన్ అస్వస్థతతో ఉన్న వృద్ది మహిళకు వైద్యం చేయించి ఆశ్రమంలో చేర్పించడం పట్ల స్థానికంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.