
Honored for “Sai Shivani” who secured rank in Civil Services : వరంగల్ నగరం శివనగర్ కు చెందిన ఇట్టబోయిన “సాయి శివాని” సివిల్స్ లో ర్యాంక్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. శివనగర్ కు మరింత గౌరవాన్ని పెంచిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం శివనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కాంటెస్టెడ్ అభ్యర్థి మేరుగు అశోక్ వారి బృందం సాయి శివాని ని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని తల్లిదండ్రులు రాజ్ కుమార్ రజిత గార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి తో పాటు అంకతి అఖిల్, తౌటం శివ, లింగం తదితరులు పాల్గొన్నారు