Holi celebrations are filled with fun and frolic among friends in a world of colors : వసంత కాలం రాకతో ప్రకృతి పులకిస్తుంటే, రంగుల పండుగ హోళీ మిత్రుల మధ్య సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పరకాల పట్టణంలో కులమతాలకు అతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా మిత్రులందరూ ఒకచోట చేరి రంగుల కేళిలో మునిగితేలారు. ఉదయం నుంచే మిత్రులందరూ కలుసుకొని ‘హోళీ శుభాకాంక్షలు’ తెలుపుకుంటూ పండుగను ప్రారంభించారు. ప్రకృతికి హాని చేయని సహజసిద్ధమైన రంగులను వాడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.”చదువు, ఉద్యోగాలు, ఇతర వృతుల బిజీలో పడి తరచుగా కలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ హోళీ పండుగ మమ్మల్ని మళ్ళీ చిన్ననాటి మిత్రులుగా మార్చేసింది. ఈ రంగుల పండుగ మా జీవితాల్లో సరికొత్త రంగులను నింపింది.” అని మిత్ర బృంద సభ్యులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎరుపు, పసుపు, నీలం.. ఇలా రంగు రంగుల ముఖాలతో గుర్తుపట్టలేనంతగా మారిన మిత్రులు, ఆఖరికి గ్రూప్ ఫోటోలు దిగి ఈ మధుర స్మృతులను సెల్ ఫోన్ లలో బంధించుకున్నారు. ఈ వేడుక కేవలం రంగుల పండుగగానే కాకుండా, స్నేహానికి చిహ్నంగా నిలిచిపోయిందని భావించారు. ఈ వేడుకల్లో నాగేళ్లి సురేష్, బొచ్చు కైలాస్, రాజు సికిందర్ , చదిరిక శ్రీనివాస్ ముదిరాజ్, మంతెన సంతోష్ నేత, గాదె భాస్కర్, కొగిల చంద్రమౌళి, దామెర రాజేందర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
