
- రియాజుద్దీన్ రాకముందు రియాజుద్దీన్ వచ్చిన తర్వాత అన్నట్లు రికార్డు క్రియేట్ చేసిన ఘనుడు
- గతంలో విధులు నిర్వహించిన మండలంలో కోర్టు కేసులో ఉన్న భూమిని సైతం నాలా కన్వర్షన్ చేసినట్లు ఆరోపణలు
- రియాజుద్దీన్ రాకముందు అనుమతి లేని వెంచర్ లు చేసే రియల్టర్ లకు చుక్కలు చూపించిన రియల్టర్ లు
- రెవెన్యూ శాఖలో దుమారం రేపుతున్న జననిర్ణయం కథనాలు
Here is evidence of the Tahsildar’s conversion activities : క్రీస్తు పూర్వం, క్రీస్తు శకo… మనకు నిత్యం వినపడే మాటలు అచ్చం అలాగే రియాజుద్దీన్ రాక ముందు..?రియాజుద్దీన్ వచ్చిన తర్వాత అనే స్థాయిని ఆ తహశీల్దార్ క్రియేట్ చేసినట్లు ఆ మండలంలో జరిగిన నాలా కన్వర్షన్ లను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా గీసుగొండ మండల తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రియాజుద్దీన్ ఆ మండలంలో అనుమతి లేని వెంచర్ లను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు తహశీల్దార్ కంటే ముందు ఆ మండలంలో విధులు నిర్వహించిన తహశీల్దార్ లు అనుమతి లేని వెంచర్ లలో ఒక్క ప్లాటును కూడా నాలా కన్వర్షన్ చేయకపోవడం గమనార్హం.2023 శాసనసభ ఎన్నికల ముందు సదరు తహశీల్దార్ బదిలీ పై రావడంతో నాన్ లేఅవుట్ వెంచర్ లు చేసే రియల్టర్ లకు సదరు తహశీల్దార్ ఓ ఆయుధంగా మారినట్లు చెప్పవచ్చు.
Here is evidence of the Tahsildar’s conversion activities
- రియాజుద్దీన్ రాకముందు…?వచ్చిన తర్వాత…..
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో అనుమతి లేని వెంచర్ లు కుప్పలు కుప్పలుగా అవతరించడంలో పరోక్షంగా ప్రస్తుత తహశీల్దారే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రియాజుద్దీన్ సదరు మండలానికి రాకముందు నాన్ లేఅవుట్ వెంచర్ లు చేసే రియల్టర్ లు గత తహశీల్దార్ ల సహకారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ ప్రస్తుత తహశీల్దార్ ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుండి నాన్ లేఅవుట్ వెంచర్ లు చేసే రియల్టర్ జెట్ స్పీడ్ లో అక్రమంగా వెంచర్ లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శాసన సభ ఎన్నికల ముందు గీసుగొండ మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ అధికారి రియల్టర్ లకు అనుకూలంగా వందలాది ప్లాట్లను గజాల వారిగా నాలా కన్వర్షన్ చేసినట్లు తెలుస్తోంది. సదరు తహశీల్దార్ గీసుగొండ మండలానికి రాకముందు పదుల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు జరిగితే, ప్రస్తుత తహశీల్దార్ బాధ్యతలున స్వీకరించిన తర్వాత వందలాది నాలా కన్వర్షన్ లు జరగడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తహశీల్దార్ రియాజుద్దీన్ చేసిన ప్రతీ నాలా కన్వర్షన్ అనుమతి లేని వెంచర్ లలోని ప్లాట్లే అని ఆయనకు తెలిసి మరీ కన్వర్షన్ చేయడం కొసమెరుపు.జననిర్ణయం కథనాలలు రెవెన్యూశాఖ తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర దుమారం రేపుతుండగా కథనాలను ఎలా అడ్డుకోవాలని సదరు తహశీల్దార్ శతవిధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Here is evidence of the Tahsildar’s conversion activities
- కలెక్టర్ గారూ కాస్త దృష్టి సారించండి
- గీసుగొండ తహశీల్దార్ గా రియాజుద్దీన్ రాక ముందు… ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన నాలా కన్వర్షన్ లను కలెక్టర్ పరిశీలిస్తారా?
- కన్వర్షన్ ల వెనుక మతలబేంటో కలెక్టర్ మేడం గమనిస్తారా..?
- కలెక్టర్ మేడం విచారణ చేస్తే తహశీల్దార్ బండారం బయటపడేనా…?