Haragopal appointed as TGJLA state vice president : టిజిజెఎల్ఏ-475 సంఘ సీనియర్ నాయకులు ప్రస్తుత ములుగు జిల్లా కార్యదర్శి నిక్కచ్చి మనిషి సమస్యలపై తారతమ్యాలు భేదాలు లేకుండా నిలదీసే మనిషి సంక్షోభంలో అండగా నిలబడే వ్యక్తి మన సమస్యల పరిష్కారం గురించి ఎవరికి దడవని బెదరని వ్యక్తిత్వంతో టిజిజెఎల్ఏ సంఘంలో కొనసాగుతున్న హరిగోపాల్ ని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడానికి గతంలోనే ఆన్లైన్ మీటింగ్లో ఏకగ్రీవ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా 29-12-2025 నుండి టిజిజెఎల్ఏ-475 రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ తన యొక్క శక్తి యుక్తులను సంఘ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తారని తెలియజేస్తూ వారికి టిజిజెఎల్ఏ రాష్ట్ర కమిటీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం.
