Happy Ugadi Steps from Crisis to Prosperity : తెలుగు లోగిళ్లలోకి సరికొత్త ఆశలతో, ఆశయాలతో అడుగుపెడుతున్న ఈ ఉగాది పర్వదినం సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు, పాఠకులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
Happy Ugadi Steps from Crisis to Prosperity
ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, అది మన ఆలోచనా ధోరణిలో రావలసిన మార్పుకు సంకేతం. ప్రకృతి వైవిధ్యానికి ప్రతీక అయిన షడ్రుచుల సమ్మేళనం మన జీవితానికి ఒక గొప్ప పాఠం. తీపి, వొగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు – ఈ ఆరు రుచులు ఎలాగైతే మన పచ్చడిలో కలిసి ఉంటాయో, సమాజంలో కూడా కష్టసుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను మనం అలవర్చుకోవాలి.
Happy Ugadi Steps from Crisis to Prosperity
సత్యం ఒక్కోసారి చేదుగా ఉండవచ్చు, కానీ అది సమాజానికి మేలు చేసినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. ప్రజాస్వామ్యంలో నిజాన్ని నిర్భయంగా చెప్తూ ‘జన నిర్ణయం’ ముందుకు సాగుతున్నది. వృత్తిపరమైన ఆటంకాలు ఎన్ని ఎదురైనా… జన నిర్ణయం తనదైన శైలిలో ప్రజా నిరంతరం గళమెత్తుతూనే ఉంది ఉంటుంది.
Happy Ugadi Steps from Crisis to Prosperity
గడిచిన కాలంలోని సంక్షోభాలను అధిగమించి, ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంక్షేమం వైపు అడుగులు వేయాలని మనం ఆకాంక్షిద్దాం. ప్రకృతి ప్రసాదించిన వనరులను కాపాడుకుంటూ, మానవ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. వనరుల పరిరక్షణే రేపటి తరానికి మనం ఇచ్చే గొప్ప ఆస్తి. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాజేందర్ దామెర (దారా)
ఎడిటర్, జన నిర్ణయం
సహజ వనరుల పరిరక్షణ వేదిక
వ్యవస్థాపక అధ్యక్షులు,
