
- పెంచిన పెన్షన్లు మంజూరు చేసేదాకా పోరాటం కొనసాగిస్తాం
- ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ అడ్డూరి అనిల్ మాదిగ కో ఇంచార్జ్ బొంకూరి కార్తీక్ మాదిగ
Hanumakonda district elkarhurthy mandal వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, నేత, గీతకార్మికులు తదితర పెన్షనుదారులు తమ హక్కుల కోసం గళం ఎత్తారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం భారీ ఎత్తున ధర్నా చేపట్టి, పెన్షన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ అడ్డూరి అనిల్ మాదిగ, కో-ఇంచార్జ్ బొంకూరి కార్తీక్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగగా పెద్ద ఎత్తున వికలాంగులు, వృద్ధులు, వితంతువులు నినాదాలతో కార్యాలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.
ఈ సందర్భంగా అడ్డూరి అనిల్ మాదిగ మాట్లాడుతూ వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ వృద్ధులు వితంతువులు నేత గీతకార్మికులు మరియు ఇతరులకు రూ.4 వేల పెన్షన్, పూర్తిస్థాయి కండరాల క్షీణత గల వారికి రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటికీ అమలు చేయకపోవడం ప్రజలతో మోసం చేసినట్లే అని అన్నారు పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజల హక్కులను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం అని పేర్కొన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి పెన్షన్లను అమలు చేయకపోతే నిరసనలు తీవ్ర రూపం దాల్చుతాయి అని హెచ్చరించారు.
అనంతరం ఆందోళనకారులు తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు పెన్షన్ల సమస్యపై త్వరలోనే పెద్ద ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం హామీలు గాలికొదిలేస్తే, హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో VHPS జిల్లా నాయకులు మారుపాక రవీందర్ మాదిగ, VHPS మండల ఇన్చార్జ్ నార్లగిరి శ్రీనివాస్, MSP మండల నాయకులు అంబాల సంపత్, MRPS మండల నాయకులు అడ్డూరి నవిన్ మాదిగ, MSF మండల అధ్యక్షుడు గొల్లమందల చరణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు అడ్డూరి శ్రీకాంత్ మాదిగ,ఉపాధ్యక్షులు శనిగరం వంశి మాదిగ,ఎమ్మార్పీఎస్ జీలుగుల అధ్యక్షులు ఆరేపెల్లి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి అరేపల్లి ప్రశాంత్,దామెర అధ్యక్షులు గంగారపు రాజుమాదిగ, మైస మధుకర్మాదిగ,పవన్ మాదిగ వికలాంగులు,వృద్దులు, ఒంటరి మహిళలు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది