
డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్
ఆధిపత్య దోపిడి కుట్ర సిద్ధాంతంపై ఎక్కుపెట్టిన ఏకలవ్వుడి విల్లంబు, వెలి వాడల తొలిపొద్దు, భారతీయ మూలవాసుల ఆత్మగౌరవ ధిక్కార పతాక రోహిత్ వేముల అని డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ కొనియాడారు. శుక్రవారం హనుమకొండలో ఎర్పాటు చేసిన డిబిఎఫ్ కార్యకర్తల సమావేశంలో చుంచు రాజేందర్ మాట్లాడుతూ మనువాధుల కుట్రలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న దళిత నీలి సైనికుడు రోహిత్ వేముల బలై నేటికి తొమ్మిదేళ్లు కావస్తున్న సందర్భంగా 9వ వర్ధంతిని ఘనంగా నిర్వహిం చారు. ఈరోజును దేశవ్యాప్తంగామనువాద ఆధిపత్య భావజాలానికి వ్యతిరేక ప్రతిజ్ఞ దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహానీయుల ఆలోచన విధానంతో రోహిత్ వేముల ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర మహిళ నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా కార్యదర్శి మేకల అనిత,డిబిఎఫ్ జిల్లానాయకులు పోలేపాక మల్లేశం, రవి, దళిత నాయకులు మాదాసి అబ్రహాం,రాజు తదితరులు పాల్గొన్నారు.