
- తనను కదిలించే వారే లేరంటూ ధీమా..!
- సంబంధిత ఐటిడిఎ అధికారుల ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్న సదరు టీచర్…
- టీచర్స్ యూనియన్లు సైతం అండగా ఉంటాయట…
- చర్చానీయాంశంగా మారుతున్న “జన నిర్ణయం” వార్తాకథనాలు…
- సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల పై ఐటిడిఎ పీఓ సైతం ఆరా తీస్తున్నారని సమాచారం….
Mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని”సోమ్లాతండా” గిరిజన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ బడి పంతులు బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనను కదిలించే వారే లేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పాఠం చెప్పేది లేదు పాఠశాలలో సమయం గడిపేది లేదు అయినప్పటికీ సంబంధిత ఐటిడిఎ అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయంటూ సదరు టీచర్ ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీచర్స్ యూనియన్లు సైతం అండగా ఉంటాయటు కాలర్ ఎగరేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
మరోవైపు jananirnayam “జన నిర్ణయం” వార్తాకథనాలు చర్చానీయాంశంగా మారుతున్నాయి. సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల పై ఐటిడిఎ పీఓ సైతం ఆరా తీస్తున్నారని సమాచారం. పాఠం చెప్పేది లేదు పాఠశాలలో సమయం గడిపేది లేదు అయినప్పటికీ ప్రభుత్వ వేతనం పొందుతూ వ్యక్తిగత పనుల్లోకి రాజ్యమేలుతున్న సదరు టీచర్ పట్ల సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టి అధికారులు చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.