
- చోద్యం చూస్తున్న అధికారులు…!
- “రామ”నీయంగా రాజ్యమేలుతున్న టీచర్…
- సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల ఆ టీచర్ కు వరంగా మారిందనే ఆరోపణలు…
- జీతం తీసుకోవడం పక్కా… పర్సనల్ పనులే లెక్క..
- కొరవడిన సంబంధిత ఐటిడిఎ అధికారుల పర్యవేక్షణ…
- అధికారుల అలసత్వంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్న టీచర్…
అది mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల. అసలు ఆ పాఠశాల ఉన్నట్టా..? లేనట్టా..? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే అక్కడ పట్టుమని పది మంది విద్యార్థులు కూడా ఉండరు. ఒకవేళ ఉన్నట్లు చూపించినా రికార్డుల్లో మాత్రమే. ఇక ఆ పాఠశాలకు కేటాయించిన టీచర్ పాఠం చెప్పేది లేదు, పాఠశాలలో సమయం గడిపేది లేదు. వచ్చామా చూశామా తమ వ్యక్తిగత పనుల్లోకి జారుకున్నామా అన్నట్లుగానే ఉంటుంది వ్యవహారమంతా. ఇది అక్కడ బహిరంగ రహస్యమే. కానీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. దీంతో సదరు ప్రభుత్వ టీచర్ “రామ”నీయంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వాన్ని ఆసరా చేసుకున్న సదరు టీచర్ పక్కాగా ప్రభుత్వ వేతనం తీసుకుంటూ, పర్సనల్ పనుల్లో బిజీగా ఉండటం నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరీచప్పుడు కాకుండా సమ్మగా ప్రభుత్వ వేతనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ఆ టీచర్ కు సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల వరంగా మారిందనేది కాదనలేని సత్యం. ఇట్టి విషయంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ )ని జన నిర్ణయం ప్రతినిధి వివరణ కోరగా తమ పరిధిలోకి రాదని చెప్పగా, ఇక itda officers ఐటిడిఎ అధికారులు విషయాన్ని దాటవేయడం గమనార్హం.ఇక మరోవైపు సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ చేయడంలో అధికారులు ఎవరికి వారుగా చేతులెత్తేసే ధోరణిలో ఉన్నారని ఉపాద్యాయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల ఆశీస్సులతోనే సదరు టీచర్ “రామ”నీయంగా రాజ్యమేలుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే..!