
- రియల్టర్లకు అండగా నాలా కన్వర్షన్ చేసిన ఘనుడు ..!
- వ్యవసాయ భూములను గజాలుగా మార్చిన వైనం …!
- నాన్ లేఅవుట్ వెంచర్ యజమాన్యాల కోసం గజాలుగా నాలా కన్వర్షన్..
- ముడుపులు చెల్లించు నాలా కన్వర్షన్ చేపించుకో అనే తరహాలో సాగుతున్న తతంగం…
Gharana “Tahsildar” : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని “మల్లన్న” మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ తహశీల్దార్ అండగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. హనుమకొండ జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఆ తహశీల్దార్ కు ముడుపులు చెల్లిస్తే ఏదైనా సాధ్యమని మండలంలో ప్రచారం సాగుతోంది. ఆ తహశీల్దార్ ఎలాంటి అనుమతులు లేని నాన్ లే అవుట్ వెంచర్ల వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేసి రియాల్టర్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో నజరానాలు అందుకొని వ్యవసాయ భూములను నాలా స్థలాలుగా మార్చాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Gharana “Tahsildar”
ఆ మండలం మొత్తం నాలా కన్వర్షన్ చేయాలంటే గజానికి కొంత పర్సంటేజ్ ఆ తహశీల్దార్ కి ముడుపులు చెల్లించుకున్న తర్వాతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు అమ్మకానికి పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆ తహశీల్దార్ పరిధిలోని ఉన్న నాన్ లేఅవుట్ వెంచర్లను నాలా భూమిగా కన్వర్షన్ గా మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తహశీల్దార్ అక్రమాలపై విచారణ జరిపితే అసలు విషయం బయటపడఉతుందని పలువురు భావిస్తున్నారు.
Gharana “Tahsildar”