
మావోయిస్ట్ నేత గాజర్ల రవి మృతి
మారేడుపల్లి అడవుల్లో “ఆపరేషన్ కగార్”
మావోయిస్టు నేత గాజర్ల రవి స్వగ్రామం వెలిశాలలో విషాదఛాయలు…
ముగిసిన 4దశాబ్దాల మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానం
మావోయిస్టు పార్టీకి అగ్రనాయకత్వాన్ని అందించిన గాజర్ల కుటుంబం….
ప్రజాక్షేత్రంలో గాజర్ల అశోక్ @ఐతు…
Gazerla Ravi encounter “Velishala” silence : వెలిశాల నిశబ్దం అయింది. ఒకరకంగా ఇప్పుడు వెలిశాల విశ్వవ్యాప్తంగా లిఖించబడిన ఊరు. ప్రపంచంలో గెరిల్లా యుద్దాన్ని సమర్థించే వాళ్లు, ప్రస్తుతం సాగుతున్న ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్న సంస్థలు సైతం వెలిశాల గ్రామ ప్రస్థానాన్ని లికించక తప్పదు. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెలిళాల గ్రామంలోని గాజర్ల కుటుంబం మావోయిస్టు ఉద్యమానికి అందించిన నాయకత్వం అంతా ఇంతా ఏం కాదు. ఏకంగా వారి కుటుంబ వారసులను అందిందించి గాజర్ల కుటుంబం. అందుకే గతంలో ఆజాద్ అసువులు బాసినా, నేడు ఆపరేషన్ కగార్ లో భాగంగా గాజర్ల రవి అసువులు బాసిన వెలిశాల ఆ వెలిశాలలోని గాజర్ల కుటుంబం చరిత్రలో లికించబడుతుందని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
************
Gazerla Ravi encounter “Velishala” silence
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ‘ఎన్కౌంటర్’లో మావోయిస్టుల విప్లవాత్మక మార్గంలో అడుగుపెట్టిన గాజర్ల రవి మృతి చెందారనే వార్తతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెలిశాల గ్రామంలో నిశ్శబ్దం అలుముకుంది. “ఆపరేషన్ కగార్” లో భాగంగా సాగుతున్న ఎన్కౌంటర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు గజర్ల రవి, అరుణ మృతి చెందారు. దీంతో మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగినట్లు అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఇందులో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ బిరుసు, AOB సభ్యుడు వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ ఉన్నారు.
Gazerla Ravi encounter “Velishala” silence
2003లో అలిపిరి అడవుల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై జరిగిన బాంబు దాడిలో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు చలపతి భార్య అరుణ. ఆమె తల్లి మావి, సోదరుడు ఆజాద్ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. గతంలో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. మావోయిస్టుల ఉనికి గురించి అందిన సమాచారం మేరకు మారేడుమిల్లి అడవుల్లో ఏపీ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని, ఈ ఎన్కౌంటర్ తెల్లవారుజామున జరిగిందనేది వార్తాకథనాలు తెలుపుతున్నాయి.
Gazerla Ravi encounter “Velishala” silence
- ముగిసిన 4 దశాబ్దాల మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానం…
గాజార్ల రవి గత 35 సంవత్సరాల క్రితం తన అన్న సారయ్య, అలియాస్ ఆజాద్‌తో కలిసి పార్టీలో చేరాడు. కాగా, అన్నల బాటలోనే తన చిన్న తమ్ముడు అశోక్ సైతం మావోయిస్టు పార్టీలో చేరారు. అన్న ఆజాద్ ఎన్కౌంటర్లో అమృతి చెందగా తమ్ముడు అశోక్ లొంగిపోయాడు. ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో ఎన్నికల రాజకీయల్లో ప్రజల పక్షపాతిగా ముందుకు సాగుతున్నారు. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి మృతి చెందటంతో భూపాలపల్లి జిల్లా ఉమ్మడి చిట్యాల మండలం ప్రస్తుతం టెకుమట్ల మండలంలోని వెలిశాలలో విషాద ఛాయలు అమలుకున్నాయి. దీంతో గాజర్ల రవి నాలుగు దశాబ్దాల మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానం ముగిసిందని పలువురు భావిస్తూనే అశృనివాళి ఘటిస్తున్నారు.ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమానికి బలమైన నాయకత్వాన్ని అందించిన గాజర్ల కుటుంబ వారసత్వం చరిత్రలో లిఖించబడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.