
Oplus_131072
Former MPTC honours Tejaswini Reddy : సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన జిన్నా తేజస్విని రెడ్డి 532.5 మార్కులతో రాష్ట్ర రెండవ ర్యాంకర్ గా నిలిచినందున, వారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించడం జరిగిందని ఆ గ్రామ మాజీ యం.పి.టీ.సి కొమ్ముల భాస్కర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Former MPTC honours Tejaswini Reddy
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన చదువుల తల్లి, సరస్వతీ పుత్రిక జిన్నా తేజస్విని రెడ్డి గారి కృషి, పట్టుదల నేటి యువతకు ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు. వారి తాత జిన్నా రమణారెడ్డి గారు భారత సైనిక దళంలో ఆర్మీగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ చదువుల్లో, ఆటల్లో అనేక రకాలుగా ప్రోత్సహించే వారని అన్నారు. రమణారెడ్డి గారి వారసురాలిగా తన మనవరాలు మా ఊరి పేరును, కీర్తిని పెంచారని అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా కృషిచేసి పని చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చనే ఫలితాన్ని నేడు తేజస్విని రెడ్డి గారు నిజం చేసి చూపించారని అన్నారు. నేటి యువత తేజస్విని రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని చదువుల్లో, ఉద్యోగాల్లో, ఉపాధి మార్గాల్లో ఉత్తమ స్థానాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.