
- పదవీ విరమణతో అక్రమాలను తండ్రీ కొడుకులు సమాధి చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం…
- హెల్పర్ నుండి ఏడిఈ గా ఎదిగిన అధికారి ప్రమోషన్ లపై సమగ్ర విచారణ జరిగేనా?
- ప్రస్తుత “సిఎండి” కి సవాల్ గా మారిన ఏడీఈ అక్రమ ప్రమోషన్ ల వ్యవహారం
- ఏసీబీ అధికారులు సదరు ఏడీఈ పై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తే బినామీ పేర్లతో అనేక అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందంటూ ఎన్పీడిసిఎల్ లో జోరుగా ప్రచారం..
Father is an association leader…Son is a minister OSD : టిజి ఎన్పీడిసిఎల్ లో ఓ ఏడీఈ పదవి విరమణ చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేయనున్న సదరు అధికారి అసోసియేషన్ నాయకుడిగా గత కొన్నిసంవత్సరాలుగా కొనసాగుతూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ శాఖలో తన తండ్రి మరణాంతరం హెల్పర్ గా చేరిన సదరు అధికారి అనతికాలంలోనే అనేక ప్రమోషన్ లు పొంది ప్రస్తుతం ఏడీఈ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అక్రమ మార్గాల్లో ప్రమోషన్ పొందిన ఈయన ఏడిఈ గా విధులు నిర్వహించిన కాలంలో అనేక రకాలుగా బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసి అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ సిఎండి ఉన్న కాలంలో తానే ఏడీఈ తానే సిఎండి గా ప్రచారం చేసుకున్న ఈ ఏడీఈ ఆ సిఎండి పేరు చెప్పి కిందిస్థాయి ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ” ఏడీఈ” పదవీ విరమణ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ తనపై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ ఉన్నతాధికారులను సైతం బోల్తా కొట్టిస్తున్నట్లు ప్రచారం లేకపోలేదు.
Father is an association leader…Son is a minister OSD
సదరు అధికారి అసోసియేషన్ నాయకుడు కావడం, ఈయన తనయుడు ప్రస్తుతం “కొండంత”అండగా ఉండే ఓ మంత్రికి ఓఎస్డీ కావడంతో ఈ అధికారి అక్రమాలపై విచారణ జరగట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అవినీతి అధికారులపై కొరడా ఝులిపిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు పదవీ విరమణ చేయనున్న సదరు ఏడీఈ పై దృష్టి సారిస్తే బినామీల పై ఉన్న అనేక అక్రమాస్తులు బయటపడుతాయని విద్యుత్ శాఖలో ప్రచారం జరుగుతోంది. హెల్పర్ నుండి ఏడిఈ గా పదవి విరమణ చేస్తున్న ఈ అధికారి ప్రమోషన్ లపై ప్రస్తుత సిఎండి విచారణ చేస్తారో లేదో చూడాల్సిందే…
Father is an association leader…Son is a minister OSD
- సిఎండి సార్ ఆ ఏడిఈ ప్రమోషన్ ల పై విచారణ చేస్తారా..?
- అసలు ఆ అధికారి జైలుకు ఎందుకు వెళ్లారు..?
- ఆ అధికారి పై ఏసీబీ అధికారులు దృష్టి సారించేనా..?