
- పరకాలలో వెలుగు చూసిన నకిలీ మొక్కజొన్న సీడ్స్..!
- నట్టేట మునిగిన రైతు…
- ఎదుగుదల లేని విత్తనాలు ఇచ్చారంటూ ఆవేదన…
- పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం…
- తగు చర్యలు చేపట్టాలని ఏవో కు ఫిర్యాదు చేసిన బాధిత రైతు రాజయ్య….
- నకిలీ సీడ్స్ కు అడ్డాగా పరకాల మారిందనే ఆరోపణలు…
- పెస్టిసైడ్స్, పర్టీలైజర్ షాపులపై పర్యవేక్షణ కరువైందనే ప్రచారం…
Hanumakonda district హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని “లక్ష్మి సీడ్స్”లో నకిలీ మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎదుగుదల లేని విత్తనాలు ఇచ్చారంటూ మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు శనివారం వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) కు బాధిత రైతు ఫిర్యాదు చేయడం నకిలీ సీడ్స్ అమ్మకాలను మరింత బలపరుస్తుంది. గత నెలలో సుమారు రెండు ఎకరాల పైచిలుకు భూమిలో మొక్కజొన్న పంట పండించేందుకు పరకాలలోని లక్ష్మి సీడ్స్ లో మొక్క జొన్న విత్తనాలు కొనుగోలు చేసి విత్తనం నాటితే నెలరోజులైనా ఎదుగుబొదుగు లేదని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని ఏవో కు ఫిర్యాదు చేశారు. ఇక పెస్టిసైడ్స్, పర్టీలైజర్ షాపులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే నకిలీ సీడ్స్ కు పరకాల అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫర్టీలైజర్, పెస్టిసైడ్ షాపుల నిర్వాహణకు అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ నష్టపోయిన బాధిత రైతు రాజయ్య తగు చర్యలు చేపట్టాలని ఏవో కు ఫిర్యాదు చేయడం మరోసారి పరకాలలో నకిలీ సీడ్స్, నకిలీ పెస్టిసైడ్స్ బాగోతం చర్చకు దారితీసిందనేది గమనార్హం. అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారో వేసి చూడాల్సిందే…