
- ఓ వెంచర్ యజమాని కోసం ఓకే డాక్యుమెంట్ నంబర్‌తో 22 రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్…
- ఆ వెంచర్ యజమాని భారీగానే ముడుపులు చెల్లించాడని ఆరోపణలు…
- నిబంధనలకు తూట్లు పోడుతున్న వరంగల్ సబ్ రిజిస్ట్రార్..!
- నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్
- వరంగల్ సబ్ రిజిస్ట్రార్ పనితీరు పట్ల విమర్శలు..
Everything is possible for the Warangal Sub-Registrar : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వరంగల్ రూరల్ రిజిస్ట్రార్ హవా జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నాన్ లే అవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడంలో ఆరితేరిన అధికారి ఏకంగా ఓ నాన్ లేఅవుట్ వెంచర్ యజమాని కోసం ఒకే డాక్యుమెంట్ నంబర్‌తో 22 మందికి రిజిస్ట్రేషన్ చేసి బారి మొత్తంలో ముడుపులు దండుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.
Everything is possible for the Warangal Sub-Registrar
గీసుగొండ ప్రాంతంలోని రెండు నాన్ లే అవుట్ వెంచర్లలలో కూడా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ తమను ఎవరేం చేయలేరనే ధీమాతో తమ హవా సాగిస్తున్నట్లు సమాచారం. గత కొన్నినెలల క్రితం వరంగల్ రూరల్ కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్ గా బదిలీపై వచ్చిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అందినకాడికి దండుకున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రచారం సాగుతోంది.
Everything is possible for the Warangal Sub-Registrar
ఆ సబ్ రిజిస్ట్రార్ అవినీతికి కేరాఫ్ గా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అధికారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా నాన్ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం ఇతగాడికి వెన్నెతో పెట్టిన విద్యగా పలువురు భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు చేపట్టకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Everything is possible for the Warangal Sub-Registrar
- ఆ నాన్ లే అవుట్ వెంచర్లెక్కడ..? ఓకే డాకుమెంట్ నంబర్ తో 22 మందిపై రిజిస్ట్రేషన్ జరిగిన కథేంటి..? ఆధారాలతో సహా త్వరలో….