
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్…
నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు సహా ఏడుగురు నక్సల్స్ మృతి…
అరణ్యం ఉలిక్కిపడుతోంది. తుపాకుల మోతలతో దద్దరిల్లుతోంది. ఇటీవల ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం వరుస ఎన్కౌంటర్లతో రక్తసిక్తమయిన విషయం తెలిసిందే.. తాజాగా…ములుగు జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని ఎటునాగారం మండలం చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌంబ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్ కౌంటర్లో బద్రు (35), మధు (43), కరుణాకర్ (22), జై సింగ్ (25), కిషోర్ (22), కామేష్ (23), జమున (23), ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు నేత భద్రత తోపాటు మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నేపంతో మావోయిస్టులు, పంచాయతీ కార్యదర్శి, అతని అన్నను హత్య చేసిన విషయం విదితమే. ఆ
దివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే చల్పాక సమీప అడవుల్లో పోలీసు జవాన్లకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఘటనాస్థలంలో రెండు AK-47 రైఫిల్స్, భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఎన్కౌంటర్లో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ హతమైనట్లు పేర్కొంటున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.