
- అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సింగారపు సునీల్
జన నిర్ణయం / వరంగల్ :
Efforts to achieve the rights of Dalit Christians : దళిత క్రైస్తవుల హక్కులను సాధించేందుకు కృషి చేస్తానని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సింగారపు సునీల్ అన్నారు. వరంగల్ జిల్లా లేబర్ కాలనీ ప్రాంతంలో శనివారం దళిత క్రైస్తవుల ఐక్య సమావేశం నిర్వహించారు.దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ గా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సింగరాపు సునీల్ ను ఏకగ్రీవంగా కోరు కమిటీ ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. త్వరలో వరంగల్ జిల్లాల కన్వీనర్ లను ప్రకటిస్తామని తెలిపారు. నూతన కోఆర్డినేటర్ డాక్టర్ సింగారం సునీల్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నూతన బాధితులు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ గా నన్ను నియమించిన కోర్ కమిటీకి, ఈర్ల కుమార్ కు ధన్యవాదాలు తెలు పుతూ మీరు ఏ బాధ్యతలు ఇచ్చారో తప్పకుండా పనిచేస్తూ దళిత క్రైస్తవులను ఐక్యం చేస్తూ తెలం గాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా ముందు వరుసల పెడతానని హామీ ఇచ్చారు. ప్రత్యేక ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తానని సునీల్ తెలుపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాదాసి బిక్షపతి, లింగాల ఇమ్మానియేల్ , సందెల లాజర్, కొండ్ర రాజు మాదిగ, మాతంగి రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.