
- దూడపాక నరేందర్ కాకతీయ విశ్వవిద్యాలయం సెల్ : 83742 35645
Telangana state తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ దుస్థితి చాలా బాధాకరం. దీంతో గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు రోజురోజుకు వారి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఒకానొక సమయంలో గురుకులంలో సీటు దొరికితే బాగుండు అనే ఆలోచన నుంచి ఏ గురుకులం వద్దు, మా పిల్లలు మా వద్ద ఉంటే ముద్దు అనే ఆలోచనకు తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఇంతలా తల్లిదండ్రులు ఆందోళనకు గురికావడానికి గురుకుల సంక్షేమ వసతి గృహాలు పై ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురుకులాలలో, కేజీబీవీలో సంక్షేమ వసతి గృహాలలో వరుసగా ఆహారం కలుషితం, అనుమానాస్పద మృతులు, అలాగే విద్యార్థుల ఆత్మహత్యలే వాటికి నిజ నిరూపణలు.
Telangana state తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మార్చి 8న జనగామ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు, ఆహార కలుషితం వలన,ఏప్రిల్ 14 తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులు ఆహార కలుషితం, జులై 11న కేసముద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని చనిపోవడం,అలాగే ఆగస్టు 7న మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రిలో హాజరు నమోదు చేశారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆగస్టు 14న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి లోని ఆశ్రమ పాఠశాలలో కరెంట్ షాక్ తో విద్యార్థిని మృతి చెందడం,అలాగే అక్టోబర్ 30న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిండి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో 50 కి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు, నవంబర్ 6న మంచిర్యాల జిల్లా సాయి కుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఆరోగ్యం దెబ్బతిన్నది అని సమాచారం ఉన్నది, నవంబర్ 14న ములుగు జిల్లా బండారుపల్లి గురుకులంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరం,తాజాగా నారాయణపేట జిల్లా మగునూరు జడ్పీ పాఠశాలలో ఆహారం కలుషితం వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకోల్లలుగా ఉన్నప్పటికీ పై ఘటనలు గురుకులంలో విద్యార్థుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో వివరించే నమూనాలుగా పరిగణించవచ్చు
పై సంఘటనలు అన్ని విద్యార్థుల బంగారు భవిష్యత్తుని ,అధికారుల వైఫల్యాన్ని, ప్రభుత్వ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయన్నది జనమెరిగిన సత్యం.
అధికార,ప్రతిపక్షాలు ఒక్కోరకంగా సంఘటనలు తాలూకా లెక్కలు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 916 మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో హాజరవగా, 50 మంది విద్యార్థులు అసువులు బాసారని తెలుస్తుంది. అలాగే 50 మందిలో 24 మంది ఆత్మహత్యగా, 8 మంది విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో గురుకుల సంక్షేమ జ్యోతులు ఆరిపోతున్నాయి. గత ప్రభుత్వంలోనూ ఆహార కలుషితం సంఘటనలు మనం చూసాము. 1200 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా ,పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ ఎటువంటి మరణం జరగకపోవడం గమనార్హం.
ఉచిత విద్యలో భాగంగానే గత ప్రభుత్వం చాలావరకు అద్దె భవనాల్లోనే గురుకులను ఏర్పాటు చేశారు, అద్దె భవనాల్లో సరిపడ గదులు లేక విద్యార్థులు ఎన్నో అవస్థలు పడడం ఎంతో బాధాకరం. మరుగుదొడ్లు, తాగునీరు, స్నానాలకు నీరు సరిపడక అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ కార్మికులను అన్ని గురుకులల్లో నియమించలేదు, దీంతో వసతి గృహములు అపరిశుభ్రతకు చిరునామా గా మారుతున్నాయి. ప్రభుత్వం మెస్, డైట్ చార్జీలు పెంచామని చెబుతున్నప్పటికీ హాస్టల్ విద్యార్థులకు చాలావరకు నాసిరకం భోజనం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యము,పాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా కూరగాయలు, కోడిగుడ్లు ,ఇతర నిత్యవసర సరుకులు అన్నీ ఒకే రూమ్ లో పెట్టడం అలాగే స్టోర్ రూమ్ లో పరిశుభ్రత పాటించకపోవడంతో సరుకులు మక్కి పోతున్నాయని కొన్నిచోట్ల వాటినే వండి పెడుతుండడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అని అధికారులు చెబుతున్నారు. గురుకులాలలో విద్యార్థుల ఆరోగ్య దృశ్య గత ప్రభుత్వం పానేషియా హెల్త్ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిత్యం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రణాళికమైన ప్రమాణాలు పాటించేవారని విద్యార్థులు తెలియజేయడం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము .కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ యొక్క వ్యవస్థను మళ్ళీ పున :ప్రారంభించాలని తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న వయసులోనే విద్యార్థులు ఆత్మహత్యకు గురికావడం యావత్ తెలంగాణ ప్రపంచాన్ని ఎంతో కలిచివేయడం జరుగుతున్నది. చిన్న వయసు పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలనే అభిప్రాయం వారికి రాదు అనేది ఒక వాదన అయితే ,ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు అనేది మానసిక వైద్యుల అభిప్రాయం. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో మానసిక వేదనకు గురి అవుతున్నారు అని నివేదికలు చెబుతున్న వారి ఆరోగ్య పర్యవేక్షణ పై ప్రభుత్వం ఎందుకు సైకాలజిస్టులను నియమించలేదు అనే విమర్శలు ప్రజల్లో నుంచి వినిపిస్తున్నాయి. సంవత్సర కాలంలో విద్యావ్యవస్థపై ఎంతో నష్టం జరగకనే జరిగింది అని చెప్పవచ్చు. ప్రభుత్వం తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి విద్యార్థులు మానసికంగా వేదన గురికాకుండా హాస్టల్లో డాక్టర్లను నియమించాలి. అద్దె భవనాల్లో కాకుండా తక్షణమే సొంత భవనాలను నిర్మించి విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా చూడాలి. అవసరమైన అన్ని వసతులు కల్పించి సంక్షేమ గురుకులాలను సంతోష గురుకులాలుగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలుసుకుందాము.