
- సమస్య సృష్టించేది ఆయనే పరిష్కారం చేసేది ఆయనే అనే ఆరోపణలు…
- అర్హత లేకున్నా… అందలమెక్కించిన అధికారులు…
- అన్ని తెలిసి సహకరిస్తున్న ఉన్నతాధికారులంటూ విమర్శలు…
DTC’s favorite state in “DRDA” : హనుమకొండ జిల్లా డిఆర్డిఏలో జిల్లా టెక్నికల్ సెల్ డిటిసి ఇస్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు ఒక గంట మాత్రమే విధులకు హాజరవుతూ ఆ విభాగంలో సమస్య సృష్టించేది అతనే అనే ప్రచారం జోరుగా సాగుతుంది. డిటిసిగా కొనసాగుతున్న వ్యక్తికి అర్హత లేకున్నా అతనికంటే సీనియర్స్ ఆర్హత ఉన్న సివిల్ ఇంజనీర్లు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అతనికే కట్టబెట్టి సహకరిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
DTC’s favorite state in “DRDA”
జిల్లా మొత్తం పర్యవేక్షణ చేయాల్సిన డిటిసి కనీస పర్యవేక్షణ లేకుండా వ్యవహరిస్తున్నట్లు ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్హత లేకున్నా డిటిసిగా కొనసాగుతున్న సదరు అధికారికి ఉన్నతాధికారుల సపోర్టు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
DTC’s favorite state in “DRDA”
అధికారుల అండదండలతోనే పలువురు అధికారులు ఆ డిటిసి కి సహకరిస్తున్నారని ఆ డిటిసి లేకుండా టెక్నికల్ సెల్ నడవదనే రీతిలో కలరింగ్ ఇస్తూ మండలాలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఇసి) లను ఇబ్బందులు పెడుతూ గందరగోల సమస్యలు సృష్టిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి డిటిసి గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.