
- ప్రహరీ గోడకు పాఠశాల అనుమతులా..!?
- నిర్మాణం పూర్తి కాకుండానే మెరిడియన్ స్కూల్ కి అనుమతులేలా.!?
- బ్రాంచీలు తెరిచి మరి అడ్మిషన్లు తీసుకుంటున్న మెరీడియన్..!
- నిర్మాణంలో ఉన్న పాఠశాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు…
- అసలు మెరీడియన్ కు పర్మిషన్ ఉన్నట్టా..!?..లేనట్టా!?
- విద్యార్థుల భవిష్యత్తుకు బాద్యులు ఎవరో వారికే తెలియాలంటున్న పలువురు…
Does Meridian School have permission మెరిడియన్ స్కూల్ కు అనుమతులు ఉన్నాయా అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. అసలు భవన నిర్మాణం జరగకుండానే ఆ పాఠశాలకు అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు యాజమాన్యం వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభించింది. అయితే నిర్మాణం పూర్తి కాకుండానే తరగతులు ఎలా ప్రారంభిస్తారు. ఆదరబాదరగా జరుగుతున్న నిర్మాణాల వల్ల ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు.? ఇలా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. హనుమకొండ నగర శివారు ఆరేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న ఈ పాఠశాల యజమాన్యం విద్య శాఖ నుండి తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభిస్తామని, వివిధ ప్రాంతాలలో అడ్మిషన్ల కోసం ఆఫీసులు కూడా తెరిచామని చెబుతున్నారు.
Does Meridian School have permission
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలను ప్రారంభిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న యాజమాన్యం, నిబంధనల ప్రకారం కొత్తగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే తనిఖీ ఫీజు, డిపాజిట్ తదితరాలకు బడి ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి. అగ్ని మాపక శాఖ ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీసుల క్లియరెన్స్, శానిటరీ సర్టిఫికెట్, పాఠశాల భవనం పటిష్టత ధ్రువ పత్రాలు పొందాలి. ఒకసారి అనుమతి పొందితే.. పదేళ్ల వరకూ గడువు ఉంటుంది.నిర్మాణాలు పూర్తిగా కాకుండానే అధికారులు మెరిడియన్ స్కూల్ కు అనుమతులు ఇవ్వడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సామాన్య కుటుంబం నాలుగు గదుల ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఆరు నెలల నుండి సంవత్సర కాలం పడుతుంది.
Does Meridian School have permission
మరో రెండు నెలలు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పుడే నిర్మాణం మొదలు పెట్టిన పాఠశాల భవనం రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తారు.? నిర్మాణం పూర్తిగా కుండా పాఠశాలను ఎలా ప్రారంభిస్తారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో లక్షలు వసూలు చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఎవరు? పాఠశాల యాజమాన్యం చెప్పినట్టుగా విద్యాశాఖ అధికారులు నిజంగానే అనుమతులు ఇచ్చారా? అనుమతులు లేనట్లయితే ఆ పాఠశాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది ప్రశ్నగా మారింది. పాఠశాల నిర్వహణ, అనుమతుల, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక గొప్పలు చెప్పుకుంటున్న విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తిరుతో రాష్ట్ర ప్రభుత్వం అభాసు పాలవుతుందన్న విషయం ఈ రకమైన విధానాల వల్ల అర్థమవుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ఒక స్కూలు విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.