- ఎస్సై గోవర్ధన్
DJ ban on New Year’s Eve celebrations నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ఈ వేడుకల్లో డీజేలు ఉపయోగించడం నిషేధం అని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా
మంగళవారం మాట్లాడుతూ మండల ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. హోటల్స్ మరియు నల్లబెల్లి కి వచ్చే ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అసంఘిక కార్యక్రమాలు మరియు అశ్లీల కార్యక్రమాలు జరగకుండా ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ పోలీస్ వారి పర్మిషన్ లేకుండా డీజే. సౌండ్స్ గాని ఫైర్ క్యాంప్స్ గాని నిర్వహిస్తే వారిపై కఠిన చర్య తీసుకోబడుతయాన్నారు. మందు తాగి రోడ్లమీద రేస్ డ్రైవింగ్ అలాగే ట్రాఫిక్ కు అంతర్యం కలిగిస్తే వాళ్లపై పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుందనీ ప్రతి ఒక్కరూ మీయొక్క కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంట్లోనే న్యూయార్ సెలబ్రేషన్స్ జరుపుకోవాన్నారు.
