
చర్చానీయాంశంగా మారిన “జన నిర్ణయం” కథనం
ములుగు డిఎం అండ్ హెచ్ఓ ఆరా…
విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడి…
**********************
- వైద్యం కోసం వెళ్లితే ప్రాణానికే ముప్పొచ్చిందని ఆవేదనలో బాధిత కుటుంబం…
- హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న బాధిత మహిళ…
- రహస్యంగా సెటిల్మెంట్ కోసం సాగిన ప్రయత్నాలు….
- ఎటొచ్చీ బాధితులను పక్కకునెట్టేసే మాయాజాలమే…
- ఓ ప్రముఖ వైద్యుడు, మరో డిపార్ట్మెంట్ అధికారి ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం….
- ఆ ఆసుపత్రిని సీజ్ చేయాలంటున్న పలువురు….
Distorted treatment at Sravanthi Hospital : ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్లో వైద్యం వికటించిన ఘటన రహస్యాన్ని “జన నిర్ణయం” బుధవారం సంచికలో “ఆ ఆసుపత్రిలో రహస్యం గప్ చుప్” అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అధికారులే కాదు పొలిటికల్ సపోర్ట్ ఉందనే తరహాలో వ్యవహరిస్తూ బాధిత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన స్రవంతి ఆసుపత్రి అసలు బండారం ఈ కథనంతో చర్చానీయాంశంగా మారింది. దీంతో అసలు ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్లో ఏం జరిగింది అని ములుగు డిఎం అండ్ హెచ్ఓ ఆరా తీస్తున్నట్లు సమాచారం. డిఎం అండ్ హెచ్ఓ ను జన నిర్ణయం ప్రతినిధి వివరణ కోరగా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించడం గమనార్హం.
Distorted treatment at Sravanthi Hospital
అసలు కథేంటంటే…?
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ గర్భసంచి సమస్యతో వైద్యం కోసం ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్ కు వెళ్లింది. అయితే గర్భసంచి సర్జరీ జరిగిన సదరు మహిళకు వైద్యం వికటించి ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. దీంతో బాధిత కుటుంబం హనుమకొండ, హైదరాబాద్ లాంటి ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన వచ్చింది. ములుగు జిల్లా స్రవంతి హాస్పిటల్లో జరిగిన వైద్యం కొత్త సమస్యకు కారణమని తేలడంతో బాధిత కుటుంబం స్రవంతి హాస్పిటల్ వైద్యులను నిలదీశారు. ఇక అధికారుల అండదండలు, పొలిటికల్ సపోర్ట్ పుష్కలంగా ఉందనే ధీమాతో సదరు ఆసుపత్రి నిర్వాహకులు బాధిత కుటుంబాన్ని సైడ్ చేసే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. నెలల తరబడి సాగుతున్న ఈ తతంగానికి ఫుల్ స్టాప్ పెట్టేలా గత వారం కిందట సెటిల్మెంట్ కు సిద్దపడ్డారనేది విశ్వాసనీయ సమాచారం. ఈ రాజీ కుదిరించే వ్యవహారంలో ఓ ప్రముఖ వైద్యుడు, మరో డిపార్ట్మెంట్ అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే ఎటొచ్చీ బాధితులను సైడ్ చేసే మాయాజాలం ఈ ఘటనలోనూ జరిగిందనేది గమనార్హం. మరోవైపు వైద్యం కోసం వెళ్లితే ప్రాణానికే ముప్పొచ్చిందని బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న బాధిత మహిళ స్థితికి కారణమైన స్రవంతి హాస్పిటల్ ను సీజ్ చేయాలని పలువురు భావిస్తున్నారు.
Distorted treatment at Sravanthi Hospital
విచారణ చేపట్టి తగు చర్యలు చేపడుతాం
గోపాల్ రావు – డిఎం అండ్ హెచ్ఓ – ములుగు జిల్లా
స్రవంతి ఆసుపత్రిలో ఆలస్యంగా చర్చానీయాంశం అవుతున్న ఘటనపై సమగ్రమైన విచారణ చేపడుతాం. రహస్యంగా బాధితులను విషయం బయటకు రాకుండా చేసినంత మాత్రాన వైద్యం వికటించిన ఘటన అంత తేలికైనదేమీ కాదు. వైద్యం వికటించడం అనేది చాలా సీరియస్ అంశం. ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదు. ఎవరు ఇన్వాల్వ్ అయినప్పటికీ నిజానిజాలు తేల్చి కఠిన చర్యలు చేపట్టక తప్పదు.