- కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జర్నలిస్టు నాయకులు
Desk journalists protest in front of the Collectorate హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్ట్ లతో పాటు అన్ని విభాగాల్లో అక్రిడిటేషన్ కార్డులు తగ్గింపు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళనలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో డెస్క్ జర్నలిస్ట్ లతో పాటుగా మిగతా యూనియన్ ల నాయకులు పాల్గొని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యమని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం డెస్క్ జర్నలిస్టులకు గతంలో వలే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, బిఆర్ లెనిన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, మస్కపురి సుధాకర్, రాజ్ కుమార్,టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు,మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవ మూర్తి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, డెస్క్ జర్నలిస్టులు శంకేషి శంకర్ రావు, సిహెచ్ సోమనర్సయ్య, వర్దెల్లి లింగయ్య, అల్లం రాజేష్ వర్మ, నాయకులు కోరుకొప్పుల నరేందర్,బోల్ల అమర్, బొడిగె శ్రీనువాస్,సంపత్ రావు, కిరణ్ రెడ్డి,పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఎం.సుధాకర్,శ్రీకాంత్, వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
