
- ఏఐడిఏసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రత్నం శైలేందర్
జన నిర్ణయం / హనుమకొండ : రాజ్యాధికారం కోసం దళితులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, అందుకోసం దళితవర్గాల అభ్యున్నతికి పాటు పడుతూ, రాజ్యాధికారానికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ(ఏఐడిఏసి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం శైలేందర్ అన్నారు. బుధవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలోని పరకాలకు చెందిన తనను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిం చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాము నియామక ఉత్తర్వులు అందజేసినట్లు చెప్పారు.
30 సంవత్సారాల నుండి వివిధ దళిత సంఘాలలో పని చేస్తూ, దళితులను చైతన్య పరిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీకి జిల్లా అధ్యక్షులుగా కొనుసాగుతున్నట్లు, నేను చేస్తున్న సేవా, చైతన్య కార్యక్రమాలు గుర్తించి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి నట్లు తెలిపారు. నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు రాముకి కృతజ్ఞతలు తెలిపారు.