
- అటువైపు కన్నెత్తి చూడలేని విద్యాశాఖ అధికారులు..!
- విద్యాశాఖ అధికారులు డాఫోడిల్స్ ఆధీనంలోనే…!!
- విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు…
- అనుమతులేవ్…ఆపై ఇష్టారాజ్యంగా పాఠశాల యజమాన్యం…
- నిబంధనలకు విరుద్ధంగా యధేచ్ఛగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న వైనం…
- జిల్లా అధికారులు దృష్టి సారించాలంటున్న విద్యార్థి సంఘాలు…
“Daffodils” are very dangerous : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని డాఫోడిల్స్ హైస్కూల్ ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు అందినా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. మండల విద్యాశాఖ అధికారులు డాఫోడిల్స్ హైస్కూల్ యాజమాన్యం గుప్పిట్లో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు అధికారుల నిర్లక్ష్య వైఖరే సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు.
“Daffodils” are very dangerous..!?
అనుమతులు లేవని ఆపై యధేచ్ఛగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ఆ పాఠశాల నిర్వహణ ఉందని విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ముడుపుల మంతనాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా నిర్వహించబడుతున్న ఆ హైస్కూల్ యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదంతా కామన్ విద్యాశాఖ అధికారులు మనోళ్లే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న డాఫోడిల్స్ హైస్కూల్ పట్ల జిల్లా కలెక్టర్ అయినా దృష్టి సారించి తగు చర్యలు చేపడుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే..!