Consequences of the war in West Asia Effects మధ్యప్రాచ్యంలో జరుగుతున్న తాజా యుద్ధం ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ప్రతిదాడులు, క్షిపణి దాడులు, డ్రోన్ దాడుల వల్ల తీవ్రంగా ముదిరింది. అయితే ఈ యుద్ధంలో ఎవరికీ ఎక్కువ నష్టం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే సైనిక నష్టం, ఆర్థిక నష్టం, మానవ ప్రాణనష్టం, వ్యూహాత్మక ప్రభావం అనే నాలుగు కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది.
Consequences of the war in West Asia – Effects
మొదట మానవ ప్రాణనష్టం పరంగా
చూస్తే, అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం ఈ ఘర్షణలో అత్యధిక మానవ నష్టం ఇరాన్ వైపే జరిగింది. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల ఇరాన్‌లోని కొన్ని సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాలు లక్ష్యంగా మారాయి. కొన్ని విశ్లేషణల ప్రకారం ఇరాన్లో సైనికులు మరియు పౌరులు కలిపి వందల నుండి వెయ్యికి పైగా మరణాలు జరిగి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లో కూడా క్షిపణి దాడుల వల్ల పౌరులు మరణించినప్పటికీ సంఖ్య పరంగా అది తక్కువగా ఉందని అనేక అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఎందుకు జరిగిందంటే ప్రధాన కారణం ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ప్రసిద్ధ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ (Iron Dome ) అనేది క్షిపణులను గాల్లోనే అడ్డుకుంటుంది. ఇరాన్ నుండి ప్రయోగించిన అనేక బ్యాలిస్టిక్ క్షిపణులు ఈ వ్యవస్థ వల్ల లక్ష్యానికి చేరకముందే పేలిపోయాయి. అందువల్ల పెద్ద స్థాయి నగర విధ్వంసం తగ్గింది. అయినప్పటికీ కొన్నిక్షిపణులు రక్షణ వ్యవస్థను దాటడంతో టెల్ అవివ్, హైఫా వంటి నగరాల్లో భవనాలు దెబ్బతిన్నాయి.
Consequences of the war in West Asia Effects
సైనిక నష్టం పరంగా చూస్తే…
పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇజ్రాయెల్ చాలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించే దేశం. డ్రోన్లు, సైబర్ యుద్ధం, గూఢచారి వ్యవస్థలతో కూడిన సమగ్ర యుద్ధ వ్యూహాన్ని అది ఉపయోగిస్తుంది. ఈ కారణంగా ఇరాన్‌లోని కొన్ని కీలక సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా క్షిపణి నిల్వ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలు లక్ష్యంగా మారాయి. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకారంగా భారీ క్షిపణి దాడులు చేసింది. అయితే ఇజ్రాయెల్ సైనిక మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆధారాలు తక్కువగా ఉన్నాయి.
Consequences of the war in West Asia Effects
ఆర్థిక నష్టం గురించి చూస్తే...
ఇరాన్ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఇరాన్ ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో బాధపడుతున్న దేశం. అమెరికా మరియు పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా ఒత్తిడిలో ఉంది. యుద్ధం వల్ల చమురు నిల్వ కేంద్రాలు, పరిశ్రమలు దెబ్బతింటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ యుద్ధ పరిస్థితుల వల్ల పెట్టుబడులు తగ్గడం, పర్యాటకం నిలిచిపోవడం వంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి.
Consequences of the war in West Asia Effects
వ్యూహాత్మక నష్టం అనే కోణంలో చూస్తే
రెండు దేశాలకు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఇరాన్ ప్రధానంగా మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగితే ఇరాన్ మద్దతు గల మిలీషియా బలగాలు లెబనాన్, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో మరింత చురుకుగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా తన భద్రతను కాపాడుకోవడానికి భారీ సైనిక చర్యలు కొనసాగిస్తోంది. ఈ యుద్ధంలో మరో ముఖ్య అంశం అంతర్జాతీయ రాజకీయాలు. అమెరికా స్పష్టంగా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోంది. మరోవైపు కొన్ని విశ్లేషకులు రష్యా , చైనా నార్త్ కొరియా ఇరాన్‌కు రాజకీయంగా మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితి యుద్ధాన్ని ప్రాంతీయ ఘర్షణ నుండి పెద్ద అంతర్జాతీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది.
Consequences of the war in West Asia Effects
మానసిక మరియు సామాజిక ప్రభావం
యుద్ధంలో ఈ ఎత్తుగడ కూడా పెద్ద అంశమే. ఇజ్రాయెల్ నగరాల్లో ప్రజలు నిరంతరం బంకర్లలోకి వెళ్లాల్సి వస్తోంది. పిల్లలు, వృద్ధులు భయంతో జీవిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో కూడా వైమానిక దాడుల భయం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధం అంటే కేవలం సైనికుల మధ్య పోరు కాదు; సాధారణ ప్రజల జీవితాలపై పడే భారమూ చాలా ఎక్కువ. అన్ని అంశాలను కలిపి స్థూలంగా పరిశీలిస్తే ప్రస్తుతం ఈ యుద్ధంలో తక్షణ మానవ నష్టం మరియు మౌలిక వసతుల నష్టం పరంగా ఇరాన్ వైపు ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. అయితే భద్రతా ఒత్తిడి మరియు నిరంతర క్షిపణి భయం పరంగా ఇజ్రాయెల్ కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీర్ఘకాలంగా యుద్ధం కొనసాగితే రెండు దేశాలకూ భారీ ఆర్థిక, సామాజిక నష్టం తప్పదు. అందుకే అనేక అంతర్జాతీయ విశ్లేషకులు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నారు: యుద్ధంలో నిజంగా గెలిచేవారు ఎవరూ ఉండరు. చివరికి ఓడిపోవేది సాధారణ ప్రజలే. మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ శాంతి స్థిరపడకపోవడానికి ఇదే కారణం.
Consequences of the war in West Asia Effects
చివరిగా…ఈ ఘర్షణలో తక్షణంగా ఎక్కువ నష్టం ఇరాన్‌కు జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, యుద్ధం కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ రెండూ భారీ ధర చెల్లించాల్సిందే. మధ్యప్రాచ్యంలో శాంతి సాధించకపోతే ఈ ప్రాంతం మరింత పెద్ద యుద్ధ వేదికగా మారే ప్రమాదం ఉంది.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
సెల్ : 9849328496
