
Oplus_131072
పోచారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో నాయకుల పిలుపు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలతో పరకాల మండలంలోని పోచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి అశోక్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, ఎఎంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, సమన్వయ కమిటీ సభ్యులు అల్లం రఘు నారాయణ, నలుబోలు కిష్టయ్య, బొజ్జం రమేష్, పల్లెబోయిన శ్రీనివాస్, కొత్తపల్లి రవి, కొలిపాక చందు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కట్కూరి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పోచారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకై 5 కోట్ల 74 లక్షలు 8 వర్కులు మంజూరైనాయి మరియు గ్రామంలో 708 మందికి 51లక్షల 19వేయిల రైతు ఋణ మాఫీ జరిగింది, 443 మందికి 2కోట్ల 97లక్షలు రైతు భరోసా పథకం ద్వారా లబ్ది పొందారు, 256 ఇండ్లకు 7లక్షల 70వేయిల రూపాయలతో గృహ జ్యోతి పథం ద్వారా ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథం 268 మహిళలకు రూ. 500లకు గ్యాస్ పంపిణీ, కల్యాణ లక్ష్మి-షాదిముబారక్ పథం ద్వారా 14మందికి 14లక్షల 2వేయిలు మంజూరు, సిఎంఆర్ఎఫ్ 11 మందికి 3లక్షల 13వేయిలు మంజూరు, ఒక్కరికీ ఎల్ఓసి రెండు లక్షలు రూపాయలు మంజూరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 59 మందికి మంజూరు, మరియు 317 ఇందిరమ్మ ఇళ్లు, 31 మందికి రేషన్ కార్డులు మంజూరు, సన్న వడ్లకు బోనస్ ఇవికాక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, మహిళా సంఘాలకు రుణాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేసిందని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని సూచించారు.