
- హనుమకొండ నగరంలో మెడికల్ దందాకు “కేర్ ప్లస్ ఫార్మసీ”నే సాక్ష్యం..!
- యధేచ్ఛగా జనరిక్ మందులను విక్రయిస్తున్న కేర్ ప్లస్ ఫార్మసీ…
- అనేక మెడికల్ షాపుల్లో ఇదే తరహా వ్యవహారం సర్వసాధారణంగా మారిన వైనం…
- నాన్ ఫార్మసీలతో నిర్వహిస్తున్న మెడికల్ షాపులు అనేకం…
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు..!!
- అంతా డ్రగ్ ఇన్స్పెక్టర్ల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు…
- కొత్త కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలంటున్న ప్రజలు పలు ప్రజాసంఘాలు…
Collector should crack down on medical racket : మందులంటే ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం. ఇటువంటి కీలక అంశంలోనే ఔషధ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఫార్మసీ సర్టిఫికెట్లను లీజుకు తీసుకుని బినామీలు మెడికల్ షాపులు ప్రస్తుతం చాలా చోట్ల కొనసాగుతున్న విషయం సర్వసాధారణంగా మారింది. మరోవైపు యధేచ్ఛగా జనరిక్ మందులను సైతం ఎంఆర్పీ రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకోవడం బహిరంగ రహస్యంగా మారింది. ఇందుకు హనుమకొండ చౌరస్తాలోని కేర్ ప్లస్ ఫార్మసీ సాక్ష్యంగా నిలుస్తోంది.
Collector should crack down on medical racket
ఇటువంటి విక్రయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కలిగిన ఔషధ శాఖ పట్టించుకోకపోవడంతో మందుల షాపులది ఆడిందే ఆట.. పాడింది పాటగా అన్న చందంగా మారింది. అసలు ఔషధ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే ఎన్నో లోపాలు కనిపిస్తాయి. వారు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. అయితే జనరిక్ మందులను ఎమ్మార్పీ ధరలకు అమ్ముతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నా ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రం ఆ షాపు నిర్వాహకులకు ఆశీస్సులు అందించేలా వ్యవహరిస్తున్నారని, నాన్ ఫార్మసిస్టులు రాజ్యమేలుతున్న కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంబంధిత అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నట్లు వచ్చే ఆరోపణల్లో నిజం లేకపోలేదు.
Collector should crack down on medical racket
ఈ నేపథ్యంలో నూతనంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్నేహ శిరీష్ ఈ మెడికల్ దందాను అరికట్టేనా..? అనే చర్చలు సాగుతున్నాయి. కలెక్టర్ మెడికల్ దందాపై ప్రత్యేక దృష్టి సారిస్తే అనేక చీకటి కోణాలు బట్టబయలు అయ్యో అవకాశం ఉందని, నాన్ ఫార్మసిస్టులతో యధేచ్ఛగా నిర్వహించబడుతున్న మెడికల్ షాపులతో పాటు, జనరిక్ మందులను సైతం యధేచ్ఛగా అమ్ముతున్న కేర్ ప్లస్ ఫార్మసీ లాంటి మెడికల్ షాపుల బండారం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని, డ్రగ్ ఇన్స్పెక్టర్ల పని తీరు కూడా కొత్త కలెక్టర్ కు తెలిసే అవకాశం ఉందని ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.
Collector should crack down on medical racket
- నిబంధనలకు విరుద్ధంగా జనరిక్ మందులను అమ్ముతున్న కేర్ ప్లస్ ఫార్మసీకి ఓ రాజకీయ పార్టీ అండదండలు….
- నాన్ ఫార్మసిస్టులకు ఓ కమిటీ ఆ కమిటీకి బోర్డు లేని ఆఫీసుకు సహాకరిస్తున్నదెవరు…? డ్రగ్ ఇన్స్పెక్టర్ల పాత్ర ఏమిటి…? నాన్ ఫార్మసిస్టుల భావనం ఎక్కడుంది..? ఆ కథేంటి..? మరో కథనం త్వరలో….