
“కార్తికేయ” ఎగనామాల మిల్లర్ ధీమా..!
మేం ఒక్కరిమే లేం అంటూ ప్రచారం చేసుకుంటున్న కార్తికేయ మిల్లర్…
ఆర్ఆర్ యాక్ట్ అమలైనా ఆస్తుల వేలం వేయడంలో జిల్లా అధికారుల అలసత్వం…
సివిల్ సప్లై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం….
“కార్తికేయ”తో పాటు జిల్లాలోని ఎగనామాల మిల్లర్స్ పై ఆరా తీస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం…
హనుమకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని “కార్తికేయ” మిల్లర్ పై ఆర్ఆర్ యాక్ట్ కు సంబంధించి “జన నిర్ణయం” వరుస కథనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అంతా తెలిసినా అధికారులు “కార్తికేయ” మిల్లర్ ఆస్తులు వేలం వేయడంలో అలసత్వం వహించడం ఆ మిల్లర్ కు కలిసోస్తుంది. దీంతో అధికారులకు తీరిక లేదని, తమకేమీ ఢోకా లేదని ఆ ఎగనామాల మిల్లర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
జిల్లాలో ఎగవేతదారుల్లో “ఏం ఒక్కరిమే లేం” అంటూ ప్రచారం చేసుకుంటున్న తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు “సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్” ఇట్టి విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.”కార్తికేయ”తో పాటు జిల్లాలోని ఎగనామాల మిల్లర్స్ పై ఆరా తీస్తున్నట్లు విశ్వాసనీయంగా తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖకు శఠగోపం పెట్టి, ఆ శాఖ పంపిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకొని కోట్లు కొల్లగొట్టిన సదరు మిల్లర్ పై ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సదరు మిల్లర్ ఆస్తులు వేలం వేయకపోవడం పట్ల కమిషన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని అధికారుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమిషనర్ దృష్టి సారించడంతో జిల్లా అధికారుల్లో అలజడి మొదలైందని పలువురు అధికారులు చర్చించుకోవడం గమనార్హం. కమిషనర్ సార్ దృష్టి పెట్టారంటే “కార్తికేయ” ఎగనామాల మిల్లర్ కు తోడుగా ఎవరు పిలిచినా ఆస్తులు వేలం వేయడం తప్పదని పలువురు భావిస్తున్నారు.