
- కమిషనర్ కు డివైఎఫ్ఐ లేఖ
- నడికూడ మండలంలోని, “కార్తికేయ” శాయంపేట మండలంలోని లక్ష్మీ నరసింహ, కమలాపురం మండలంలోని శ్రీశైలం మల్లన్న, వీరభద్ర రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
- హనుమకొండ జిల్లాలో ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినప్పటికీ ఆస్తులు వేలం వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు
రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న హనుమకొండ జిల్లాలోని నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామ పరిధిలోని కార్తికేయ రైస్ మిల్లర్, శాయంపేట మండలం గట్లకానీపర్తి లక్ష్మీ నరసింహ, కమలాపురం మండలంలోని శ్రీశైలం మల్లన్న, వీరభద్ర తో పాటు గతంలో సీఎంఆర్, ఎగగొట్టి కోట్లు, లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి పౌరసరపరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా లేఖ పంపారు. గతంలో రబీ, ఖరీఫ్ సీజన్ లో సిఎంఆర్ బకాయిలు చెల్లించని రైస్ మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసినప్పటికీ ఆస్తులు వేలం వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. కార్తికేయ రైస్ మిల్లర్లపై అధికారులు అతి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. గట్ల కనపర్తి లక్ష్మీనరసింహ మిల్లుకు పరిమితికి మించి ధాన్యం నిల్వలు ఉన్నాయని, 75 ఎసికెలకు అగ్రిమెంట్ చేసుకుని 35 లక్షల పెండింగ్ లో ఉన్న ధాన్యం సరఫరా చేస్తున్నారని, కమలాపురం మండలంలో ఉన్న రెండు రైస్ మిల్లులకు అదే పరిస్థితి అని, కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నప్పటికీ ధాన్యం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు . గతంలో డిపాల్టర్ ఉన్న రైస్ మిల్లర్లకు ధాన్యం పంపించడం జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగానే పంపిస్తున్నారని దీంతో అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో తీసుకోవడం, సకాలంలో డబ్బులు అందించకపోవడంతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, రైతులను ప్రజలను మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఓ, చిరంజీవి నాయకులు పాణి సంజయ్, కిరణ్, రాము, సంతోష్ పాల్గొన్నారు.