
Oplus_131072
జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కే శ్రీనివాస్
నూతన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలో యువత విద్యార్థులు గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో అంతర్జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నూతన పరిజ్ఞానంతో కొత్త విషయాలను ఆవిష్కరించాలన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల మరింత ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఎగ్జిబిట్లను తిలకించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి బాలకృష్ణ, ఎంపీడీవో శ్రీ వాణి, ఎస్సై రాజేష్ రెడ్డి. ట్రస్మా డివిజన్ అధ్యక్షులు పాశికంటి రమేష్. జిల్లా ఉపాధ్యక్షులు జాంగిర్. మాజీ జెడ్పిటిసి జున్నుతుల రాంరెడ్డి. ప్రిన్సిపాల్ అండెం కరుణాకర్ రెడ్డి. ఏఎస్ఐ లక్ష్మాణమూర్తి, ఉపాధ్యాయ ఉపాధ్యాయునీలు. విద్యార్థులు పాల్గొన్నారు.