- సిబ్బందికి పలు సూచనలు చేసిన మేనేజర్ రాజు నాయక్
Check 108 ambulance : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను ఉమ్మడి జిల్లా మేనేజర్ శివ కుమార్, జిల్లా మేనేజర్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని రికార్డులు, అత్యవసర వైద్య పరికరాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పిలుపు వచ్చిన 30 సెకన్లలోనే స్పందించి బాధితులకు మెరుగైన ప్రాథమిక చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో ఈఎంటీ S స్వేత, పైలట్ ప్రణీత్ కుమార్ పాల్గొన్నారు.
