“Chalk beads” of corruption in “Revenue” : రాష్ట్రంలో రెవెన్యూశాఖ చర్చానీయాంశంగా మారింది. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ముద్రవేసుకుంటుంది. ఓ పక్క అవినీతి లేని రెవెన్యూశాఖగా కాలర్ ఎగరేసుకునే రెవెన్యూ అధికారులున్న ఈ శాఖలో రోజరోజుకు ఎసిబి అధికారులకు చిక్కుతున్న రెవెన్యూ అధికారుల స్థితి చర్చానీయాంశంగా మారుతోంది.
తాజాగా శుక్రవారం (తేదీ 5 డిసెంబర్ 2025) హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన రెవెన్యూశాఖ తీరుపై మరోసారి చర్చకు దారితీసింది. ఇదే శాఖలో “సుద్దపుసలుగా” చెప్పుకుంటూ పెయిడ్ రికార్డులు సృష్టించుకునే అధికారులూ లేకపోలేదు. అత్యంత సుద్దపూసలుగా కొందరు అధికారులను కొనియాడే విధంగా వార్తాప్రచాసారాలూ లేకపోలేదు. నీతివంతులకు సెల్యూట్ చేయాల్సిందే. కానీ ఈ శాఖలో రోజురోజుకు వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాస్తుల ఘటనలు అధికారుల అవినీతి తీరు సైతం చర్చానీయాంశంగా మారుతోంది. ఇక ఈ ఏడాదిలో గత ఆరునెలల వ్యవదిలోనే రాష్ట్రలో అనేక చోట్ల ఎసిబికి చిక్కిన రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇది ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. ఈ శాఖలోని సుద్దపూసల అవినీతి బాగోతాన్ని ప్రశ్నిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 29న ఖిల్లా వరంగల్ తహశీల్థార్ కోట్ల రూపాయల అక్రమాస్తులపై ఎసిబి రైడ్ జరిగి అక్రమాల బాగోతం బహిర్గతం అయ్యింది. సెప్టెంబర్ 9వ తేదీన నల్గొండ జిల్లా చిట్యాల మండల తహశీల్థార్ గుండ్రంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 172, 167లోని భూమి మ్యూటేషన్ చేయడానికి లక్షలాది రూపాయలు లంచం ఆశీసించి రెండు లక్షలతో ఎసిబి అధికారులకు చిక్కాడు. అదే నెలలో నారాయణపేట జిల్లాలోని మద్దూర్ మండలంలో ఓ ఆర్ఐ ఎసిబికి బుక్కు అయ్యాడు. అదేనెల సెప్టెంబర్ 18న వనపర్తి జిల్లా కొత్తపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ, సర్వేయర్ ఎసిబికి చిక్కారు. అదే సెప్టెంబర్ 4వ తేదీన నిజామాబాద్ నగరపాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్, ఇంచార్జి ఆర్ఐ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. అక్టోబర్ 10న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, మధురానగర్ పంచాయతీ సెక్రెటరీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సెప్టెంబర్ 17న ఖమ్మంలో తల్లాడ మండలం తహసీల్దారు, రెవెన్యు ఇన్స్పెక్టరు (RI), డేటా ఎంట్రీ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇవి గడిచిన ఈ ఆరునెలల కాలంలో వెలుగుచూసిన ఘటనలు మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఘటనలు తాజాగా కూడా అనేకం ఉండనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏదోఒకచోట రెవెన్యూ అధికారులు ఎసిబి అధికారులకు చిక్కుతున్న ఘటనలు సర్వసాధరణంగా మారాయి. ఎసిబి అధికారులను అభినందనలు తెలుపాల్సిందే. అయితే అనేక ఘటనల్లో దొరికిన అధికారుల ఇండ్లలో డబ్బుల కట్టలు వెలుగుచూడటం, ఆధాయానికి మించిన అక్రమాస్తులు బయటపడ్డట్లు వార్తాకథనాలు రావడంతో అనేకచోట, రైతులు, పలువురు సంబురాలు చేసుకునే వార్తలు కూడా చూస్తున్నామనేది గమనార్హం. రెవెన్యూశాఖలో ఇలాంటి పరిస్థితి పెరుగుతుంటే కొన్ని చోట్ల కొందరు సుద్దపూసలుగా తమ తప్పులను కప్పిపుచ్చుకునేలా ముందుకుసాగటం కూడా సర్వసాదరణంగానే మారింది.
ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. పాలకులు ఎంత మంది మారినా.. రెవెన్యూ శాఖలో త్యతంత సుద్దపూసలు ఉన్నారంటూ కొన్నిచోట్ల ఉన్నతాధికారులు సైతం దబాయించే కామెంట్స్ చేసినా, మరికొన్ని చోట్ల తహశీల్థర్లు సైతం తామూ అత్యంత సుద్దపూసలం, నీతివంతులం అంటూ మీడియా ప్రకటనలు, మూకుమ్మడి మీటింగులు పెట్టినా, మరికొంత మంది వారికి వకల్తా పుచ్చుకొన్ని వారిని నెత్తిమీదపెట్టుకున్నా అదంతా ఏదోఒక సందర్బంలో అవినీతి పుట్ట చెదిరిపోక తప్పదు అనేది తాజా ఘటనలే కాదు అనేక ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయనేది గమనించాలి.
అయితే రెవెన్యూశాటలో అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. ఏ పని జరగాలన్నా ఆయా ఉద్యోగుల స్థాయిని, సంబంధిత పనినిబట్టి లంచం డిమాండ్ చేయడం ఆనవాయితీగా మారింది. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతున్నా, కేసులు నమోదు అవుతున్నా.. లంచాలు తీసుకోవడానికి మాత్రం వెరవడంలేదు. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మొత్తం మీద రెవెన్యూశాఖలో అవినీతి ఊడలు బలంగా నాటుకుపోయాయి. ఇప్పటికైనా పాలకులు ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యశాఖ ప్రక్షాళను పూనుకోవాలి. కలెక్టర్ల స్థాయిలో వెనుకేసుకువావడం కాకుండా నిరంతరం పరిశీలనతో సమీక్ష చేయాలి. ఎసిబి మరింత దృష్టి సారించి రెవెన్యూశాఖలోని సుద్దపూసల గుట్టురట్టు చేయాలి. అవినీతి బయటపడిన అధికారులపై పకడ్బంది చర్యలు చేపట్టకుంటే మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు వారూ చేస్తూనే ఉంటారని గమనించాలి. పౌరసమాజం సైతం అవినీతి అధికారుల తీరును గమనించి అప్రమత్తంగా ఉండాలి. అభాసుపాలవుతున్న రెవెన్యూశాఖపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
- దామెర రాజేందర్ (దారా) సీనియర్ జర్నలిస్ట్
