
నాసిరకంగా సాగుతున్న చలివాగు ప్రాజెక్ట్ కాలువ నిర్మాణం..!
సమీక్షించుకుంటేనే ప్రయోజనమంటున్న పలువురు…
Chalivagu project canal Rs.10crore due to quality defect in work : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్ట్ కాలువ నిర్మాణంలో నాణ్యతలోపిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల ఎకరాలకు సాగునీరు అందించే చలివాగు ప్రాజెక్ట్ పారకం కాలువ మరమ్మత్తు పనులు సుమారు రూ.10కోట్ల వ్యయంతో చేపట్టారు. నిర్మాణం పనుల్లో పర్యవేక్షణ లేకపోవడం వల్ల నాసిరకంగా పనులు సాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ కు, ఇరిగేషన్ అధికారుల సపోర్ట్ పుష్కలంగా ఉందని దీంతో ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు అయ్యో అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
Chalivagu project canal Rs.10crore due to quality defect in work
వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన చలివాగు ప్రాజెక్ట్ వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. పలు మండలాలకు సాగునీరు తాగునీరు అందిస్తోంది. అలాంటి చలివాగు ప్రాజెక్ట్ నీటిపారకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా చేపడుతున్న కాలువ మరమ్మత్తు పనుల్లో నాణ్యత లోపించడం భవిష్యత్తుకే ప్రమాదమని పలువురు భావిస్తున్నారు. ఇంకో వైపు పొలిటికల్ సపోర్ట్ కూడా ఈ పనుల్లో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ సపోర్ట్ ఉందని, అధికారుల అండదండలు ఉన్నాయని అసలు నిర్మాణ మరమ్మత్తు పనుల్లో నాణ్యతను తగ్గిస్తే నష్టపోయేది చివరికి రైతులే అవుతాయనేది గమనార్హం. ఏది ఏమైనప్పటికీ చదివాగు ప్రాజెక్టు కాలువ నిర్మాణం మరమ్మత్తు పనుల్లో నాణ్యత లోపించకుండా పొలిటికల్ లీడర్లు, సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.