
“జన నిర్ణయం” కథనానికి స్పందన
Case registered against those who cut down trees : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో అనుమతి లేకుండా చెట్లను నరికేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూల్య వెల్లడించారు. ఆదివారం “జన నిర్ణయం”లో ప్రచురితమైన ‘ఆ చెట్లను నరికేశారు’అనే కథనానికి అటవీ శాకాధికారులు స్పందించారు.
Case registered against those who cut down trees
బీట్ ఆఫీసర్ పూల్య మాట్లాడుతూ.. ఎఫ్ఆర్ వో రవికిరణ్ ఆదేశాల మేరకు నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనుమతులు లేకుండా చెట్లను నరికే హక్కు ఎవరికి లేదన్నారు. గిర్నిబావిలో చెట్లు నరికిన నిందితులపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. వాల్ట చట్టం 2002 సెక్షన్ 35(3), వాల్టా రూల్స్ 2004 సెక్షన్ 26(2) ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఎవరు కూడా అటవీ శాఖ అనుమతి లేకుండా చెట్లను ఇష్టారీతిన నరికేయడం సరికాదన్నారు. ఏదైనా తప్పని పరిస్థితుల్లో చెట్లు నరకాల్సి వస్తే దానికి కూడా ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. కాదని ఇష్టారీతిన వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.