
Career Guidance Conference at Pingili College : హనుమకొండ పింగిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ వడ్డేపల్లిలో శ్రీగురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ సదస్సు నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలా స్థిరపడాలనే దాని గురించి ఈ అవగాహన సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని అన్నారు. చదవవలసిన మెటీరియల్ దాని ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. కెరియర్ గైడెన్స్ కన్వీనర్ డాక్టర్ జె. లకన్ సింగ్ మాట్లాడుతూ శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ వారు ఇచ్చే అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు.
Career Guidance Conference at Pingili College
కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ బి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగానికి సంబంధించిన కోచింగ్ వివరాలను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ కూడా వారి సంస్థ తరఫున ఉచిత మెటీరియల్ అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి సుహాసిని, ఐ కే సి కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ బాబు, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ జి అరుణ, కెరియర్ గైడెన్స్ మెంబర్ డాక్టర్ పి అరుణ, డాక్టర్ పి యుగేందర్, డాక్టర్ జి రాజిరెడ్డి,డాక్టర్ రామ్ రెడ్డి మరియు ఇతర ఫ్యాకల్టీ మెంబర్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఉచిత మెటీరియల్ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.