
- మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా చేస్తున్న “కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ యాజమాన్యం…
- నిద్రమత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు..
- నగరంలో యధేచ్ఛగా మందుల షాపుల మాఫియా…
- నిబంధనలు పాటించని యాజమాన్యాలు…
- అధిక ధరలతో ఇష్టారాజ్యంగా అమ్మకాలు…
- డ్రగ్ ఇన్స్పెక్టర్ల పనితీరుపై రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ చేయాలంటున్న పలువురు…
“Care Plus Pharmacy” Medical Shop Drug Dealer : హనుమకొండ నగరంలో మెడికల్ షాపుల మాఫియా చెలరేగిపోతోంది. పేరాశతో నిబంధనలు పాటించకుండా మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు హనుమకొండ చౌరస్తాలోని “కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ షాపు సాక్ష్యంగా నిలుస్తోంది.
నగరంలోని కొన్ని మెడికల్ షాపు యాజమాన్యాలు అధిక ధరలతో ప్రజలను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వినిస్తున్న నేపథ్యంలో హనుమకొండ చౌరస్తాలోని “కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ షాపు నిర్వాహకులు ఏకంగా జనరల్ మందులను సైతం తమ మెడికల్ వ్యాపారంగా మార్చుకోవడం చర్చానీయాంశంగా మారుతోంది.
“Care Plus Pharmacy” Medical Shop Drug Dealer
ఈ మెడికల్ మాఫియాకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పూర్తిస్తాయిలో అండగా నిలుస్తున్నారని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా మెడికల్ షాపులు ఫార్మాసిస్టులు నడపడం లేదని, ఫార్మసిస్టుల సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని మరొకరు షాపులు నడుపుతున్నారనేది కాదనలేని వాస్తవం అనేది గమనార్హం. దీంతో ఏవేవో మందులు జనానికి అందించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దోపిడీని, అక్రమాలను అరికట్టాల్సిన డ్రగ్స్ అధికార యంత్రాంగం నిద్రమత్తులో ఉంది. దీంతో మెడికల్ మాఫియా ఆగడాలకు హద్దేలేకుండా పోయింది.
“Care Plus Pharmacy” Medical Shop Drug Dealer
- లూజు సేల్‌తో మరింత దోపిడీ
మెడికల్ షాపులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. “కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ షాపు యాజమాన్యంతో పాటు పలు మెడికల్ షాపులు డాక్టర్ల ప్రిస్ర్కిప్షన ఉంటేనే మందులు ఇవ్వాలి. కాని ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చిన్న షాపు నుంచి పెద్ద మెడికల్ షాపు వరకు డాక్టర్ల చీటీలు లేకుండానే అడిగిన మందులు ఇచ్చేస్తున్నారు. ప్రతి షాపులోను లూజు సేల్తోనే రూ. వేలకువేలు రోజూ వ్యాపారాలు సాగిస్తున్నారు. అధికారులు చూస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అత్యవసర మందుల పేరుతో ఈ లూజు సేల్ దోపిడీ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోందని, “కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ షాపుతో పాటు పలు మెడికల్ షాపుల్లోనూ జనరిక్ మందుల దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.
“Care Plus Pharmacy” Medical Shop Drug Dealer
- “కేర్ ప్లస్ ఫార్మసీ” యాజమాన్యం బరితెగింపు
నగరంలో మెడికల్ షాపుల యాజమాన్యాలు బరి తెగించి దోచుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు హనుమకొండ చౌరస్తాలోని కేర్ ప్లస్ ఫార్మసీ సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు. మెడికల్ షాపు ముసుగులో ప్రభుత్వం అందించే రాయితీ మందులను నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రైవేట్ మెడికల్ షాపులో విక్రయిస్తూ విచ్చలవిడిగా దందా చేయడంలో ఆ మెడికల్ షాప్ యాజమాన్యం ఆరితేరిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ మెడికల్ షాపులో కొనుగోలుదారులే సాక్ష్యంగా ఉన్నారనేది గమనార్హం. ఆ మెడికల్ షాపులో జనరిక్ మందులు అమ్ముతూ అధిక రేట్లు ఎందుకు తీసుకుంటున్నారని ఎవరైనా వినియోగదారులు ప్రశ్నిస్తే ఇదంతా డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తెలుసు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దబాయించడం పలువురు బాధితులను షాక్ కు గురి చేసినట్లు తెలుస్తోంది.
“Care Plus Pharmacy” Medical Shop Drug Dealer
అయితే పొలిటికల్ అండదండలు ఉన్నాయనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా చేస్తున్న హనుమకొండ చౌరస్తాలోని ” కేర్ ప్లస్ ఫార్మసీ”మెడికల్ షాపు పై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లపై విచారణ చేపట్టాలని పలువురు భావిస్తున్నారు.