
- “కరీంనగర్ బ్లడ్ సెంటర్”పై ఆరోపణల వెల్లువ..!
- ఆ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం…
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఘనులు….
- అధిక ధరలకు బ్లడ్ నిర్వహిస్తున్న ప్రయివేటు బ్లడ్ సెంటర్లు…
- “కరీంనగర్ బ్లడ్ సెంటర్” లో బ్లడ్ ప్యాకెట్ల అమ్మకాల్లో రహస్యం..!?
- నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటున్న అధికారులు…
దారా
స్పెషల్ కరస్పాండెంట్ / జన నిర్ణయం :
Business with blood in karimnagar blood centre : “కరీంనగర్ బ్లడ్ సెంటర్”లో “రక్తం”తో వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయివేటు “బ్లడ్ సెంటర్” private blood centre నిర్వాహకులు యధేచ్ఛగా రక్తం ప్యాకెట్లను విక్రయిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కృత్రిమ కొరత సృష్టించిన, అధిక ధరకు అమ్మినా అడిగే నాథుడే కరువయ్యరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ సెంటర్లో బ్లడ్ కొరత ఉందని ప్రయివేటు ను ఆశ్రయించాలని చెప్తున్నట్లు తెలుస్తోంది. రక్తం అవసరాన్ని ఆసరా చేసుకొని తమ ప్రయివేటు వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్నారని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తనిఖీలు చేయాల్సిన డ్రగ్స్ నియంత్రణ, సంబంధిత అధికారులు నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారని పలు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. “కరీంనగర్ బ్లడ్ సెంటర్” karimnagar blood centre నిర్వాహణలో రహస్యం ఏమైనా ఉందా అనే అనుమానాలు లేకపోలేదు.
ఆ బ్లడ్ సెంటర్ లో ఒక నెల రోజుల్లో జరిగిన బ్లడ్ ప్యాకెట్ల అమ్మకాలెన్ని..? ఆ ప్రయివేటు బ్లడ్ సెంటర్ కు సమకూరుతున్న బ్లడ్ ఎంత..? బ్లడ్ ప్యాకెట్ల పై స్టికర్ ఏముంది..? సీరియల్ నెంబర్ పరిస్థితి ఏంటి..? అనే కోణంలో సమగ్ర విచారణ చేపడితే అసలు బండారం బయటపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
Business with blood in karimnagar blood centre :
“కరీంనగర్ బ్లడ్ సెంటర్” ను సీజ్ చేయాలి
బామండ్లపల్లి యుగంధర్ Aiyf రాష్ట్ర సహాయ కార్యదర్శి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ బ్లడ్ సెంటర్ ను సీజ్ చేయాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (aiyf) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు జిల్లా ఆడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం కూడా అందించాం. ప్రభుత్వ ఆసుపత్రిలో నిల్వ చేసిన రక్తనిల్వలను ప్రయివేటు బ్లడ్ సెంటర్ నిర్వహుకులకు అందేలా చేస్తూ బ్లడ్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. బ్లడ్ నిమిత్తం వెళ్ళిన వారికి ప్రయివేటు సెంటర్స్ వారిని సంప్రదించండి బ్లడ్ కొరత ఉందంటూ తేగేసి చేప్తున్నారంటేనే ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ లో పనిచేసే సిబ్బంది నగరంలోని ప్రయివేటు బ్లెడ్ సెంటర్ నిర్వాహకులు సిండికేట్ అయ్యి రక్త నిల్వలు లేవని కృత్రిమ కోరత సృష్టించి అధిక ధరలకు రక్తాన్ని అమ్ముతున్నారన్నారని తేలిపోతుంది. తక్షణమే కరీంనగర్ బ్లడ్ సెంటర్ నిర్వాహణపై సమగ్రమైన విచారణ చేపట్టాలి. ఆ బ్లడ్ సెంటర్ ను సీజ్ చేయాలి.